Nagachaitanya Engagement: సామ్ ప్రపోజ్ చేసిన రోజే.. చైతు ఎంగేజ్ మెంట్.. పర్ఫేక్ట్ రీవెంజ్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ..
నాగచైతన్య, శోభితా ధూళి పాళ్ల ఎంగెజ్ మెంట్ ఎంతో వేడుకగా జరిగింది. ఉదయం 9.42 నిముషాలకు వేడుకగా జరిగింది.ఈ విషయాన్ని ఏకంగా అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
కొత్త జంట ఇద్దరు కూడా ఆనందంగా ఉండాలని, వీరి జీవితం ఎంతో అన్యోన్యంగా కొనసాగాలంటూ కూడా ఎక్స్ వేదికగా విషేస్ చెప్పారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజులుగా శోభితా ధూళిపాళ్ల, చైతుకి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
దీంతో ప్రస్తుతం వీరు పెళ్లి బంధంతో ఒక్కటికానున్నారు. ఈరోజు చైతు, శోభితాల ఎంగెజ్ మెంట్ వేడుక జరగడటంతో నాగార్జునఫ్యామీలీ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నాగార్జున ట్విటర్ లో పోస్ట్ చేస్తు ఈరోజు తేదీని Beginning Of Infinite Love 8.8.8. స్పెషల్ గా మెన్షన్ చేయడం వెనుక ప్రస్తుతం తమదైన శైలీలో స్పందింస్తున్నారు.
గతంలో సామ్..ఇదే తేదీ ఆగస్టు 8 రోజు నాగచైతన్యకు ప్రపోజ్ చేసిందంటా. ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటై.. ఆ తర్వాత డైవర్స్ తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం మరోసారి ఈ తేదీనే వీరి ఎంగెజ్ మెంట్ పెట్టి సామ్ కు ఇన్ డైరెక్ట్ గా ఇచ్చిపాడేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు భలే బుద్ది చెప్పావ్ .. అంటూ కూడా కౌంటర్ లు ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం..పెళ్లి చేసుకోబోతున్నశొబిత తెలుగమ్మాయి. పుట్టింది తెనాలి. పెరిగింది మాత్రం వైజాగ్ లో.. ఈమె తండ్రి..వేణుగోపాల్ రావ్.. నేవీలో పనిచేసేవారు. తల్లి శాంతాదేవీ టీచర్. శోభితా మిస్ ఇండియా 2013 రన్నరప్ గా నిలిచింది. గూఢాచారిలో నటించి ఆమె ఎంట్రీ ఇచ్చారు.
దేవ్ పటేల్ తో కలిసి మంకీ మ్యాన్ లో నటించారు. మరోవైపు శోభితా పూర్తిగా వెజీటెరియన్ అంట.తన వంటను తానే చేసుకుంటుందంట. భరత్ నాట్యం , గిటార్ లలో కూడా ప్రావీణ్యం ఉందంట. ప్రస్తుతం నాగచైతన్యకు, శోభితాకు అక్కినేని ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాలలో ప్రత్యేకంగా విషేస్ చెప్తున్నారు.