Sobhita: కాబోయే కోడలికి దగ్గుబాటి లక్ష్మి క్రేజీ గిఫ్ట్.. ఫోటో వైరల్..!

Tue, 22 Oct 2024-3:18 pm,

నాగచైతన్య సమంత నుంచి విడిపోయిన తర్వాత శోభిత ధూళిపాలతో రిలేషన్ మొదలుపెట్టారు. అలా సమంత నుంచి విడాకులు ప్రకటించిన మరుసటి ఏడాది ఆమె ప్రేమలో పడిన ఈయన తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచారు.   

ఏడాది ఆగస్టు 8వ తేదీన ఆమెతో నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య,  త్వరలోనే పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలను శోభిత మొదలుపెట్టింది. సాంప్రదాయంగా పసుపు దంచడం,  విసరల్లు విసరడం లాంటి కార్యక్రమాలు ఆమె కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు తాజాగా ఆ ఫోటోలను షేర్ చేసిన విషయం తెలిసిందే. 

నవంబర్ 8వ తేదీన చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరగబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇకపోతే తాజాగా పసుపు దంచే కార్యక్రమంలో ఈమె కట్టుకున్న చీర స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. 

ఇక ఈ చీర తన కాబోయే అత్త దగ్గుబాటి లక్ష్మి ఇచ్చిందని సమాచారం. ఇక నాగచైతన్య తల్లిగా, అక్కినేని నాగార్జున మొదటి భార్యగా పేరు తెచ్చుకున్న ఈమె ఇంటీరియర్ డిజైనర్ కూడా.   

1984లో నాగార్జునను వివాహం చేసుకున్న ఈమె నాగచైతన్య జన్మించిన తర్వాత విభేదాలు రావడంతో 1990లో విడిపోయారు. మరోవైపు నాగార్జున 1992లో అమలను వివాహం చేసుకోగా.. ఆ తర్వాత కొన్నాళ్లకు దగ్గుబాటి లక్ష్మీ కూడా శరత్ విజయ్ రాఘవన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link