Naga Chaitanya-Shobhita engagement : నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం: శోభిత ధరించిన చీర ఎవరు డిజైన్ చేశారో తెలుసా?
Shobhita Saree : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా కొద్దిమంది సమక్షంలో జరిగింది. చైతూ..శోభిత ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో శోభితా చాలా సింపుల్ ట్రెండీగా ఉన్న చీరను ధరించింది. శోభితా రెడీ అయిన విధానం, చీర, నగలు, వీటికి సంబంధించి ఎన్నో విషయాల్లో నెట్టింట్ట వైరల్ అయ్యాయి.
శోభితా ధూళిపాళ్ల..అచ్చతెలుగు అమ్మాయి. ఈవిడ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్నింటిలోనూ తన సత్తా ఏంటో నిరూపించింది. అందం, అభినయంతోపాటు హాట్ లుక్స్ తోనూ అదరగొడుతుంది.
తాజాగా ఆమె అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్లేందుకు నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రముఖ హీరో నాగచైతన్యతో గురువారం శోభిత ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. అయితే వీరిద్దరూ గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు ఎన్నో వార్తలు షికారు చేశాయి. కానీ ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు. తర్వాత కాలంలో అంతగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ అనూహ్యంగా వీరిద్దరి నిశ్చితార్థం ఫొటోలను నాగార్జున షేర్ చేయడంతో అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
కాగా నిశ్చితార్థంలో శోభితా సింపుల్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంది. చాలా సింపుల్ గా పద్దతిగా రెడీ అయ్యింది. కంకబరం కలర్ లో ఉన్న చీర, మెడలో నగలు, చేతులకు గాజులు, ఇలా అన్ని విషయాలపై నెట్టింట్లో ఒక్కటే చర్చ జరుగుతోంది.
శోభితా నిశ్చితార్థంలో కంకబరం కలర్ కాంజివరం చీర కట్టుకుంది. మ్యాచింగ్ బ్లౌజ్ చాలా సింపుల్ వర్క్ తో డిజైన్ చేశారు. మెడలో హారం మరింత అందాన్ని ఇచ్చింది. తలలో కంకబరాలు, పొడవాటి బొట్టులో తెలుగుదనం ఉట్టిపడింది.
చెవులకు బుట్టాలు..శోభిత ముఖానికి మరింత అందాన్నిచ్చాయి. అయితే ఈ చీర ధర 2.30 నుంచి 3 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. నిశ్చితార్థం ఉంగరం ధర రూ. 5లక్షలు అని సమాచారం. అయితే ఈ చీరను ప్రత్యేకంగా చేనేత కార్మికులతో తయారు చేయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి నాగచైతన్య, శోభితా ధూళ్లిపాళ్ల కొత్త జీవితం షురూ చేస్తున్నారు.