Naga Chaitanya Sobitha Wedding: నాగ చైతన్య శోభితల పెళ్లి.. అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకు.? అసలు కారణం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..
Naga Chaitanya Sobitha Wedding: సమంతతో విడాకుల తర్వాత చైతూ తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోవైపు సామ్ కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది. కానీ చైతూ మాత్రం.. తన తోటి నటి శోభితతో కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నాడు.
వీరి వివాహాం డిసెంబర్ 4న రాత్రి 8.13 నిమిషాల ముహూర్తానికి జరగనుంది. తెలుగు సంవత్సరాది క్రోధి నామ సంవత్సరం.. మార్గశిర శుద్ద పంచమి..ఉత్తరాషాఢ నక్షత్రం మిథున లగ్నంలో జరగబోతుంది. ఇప్పటికే వీరి మ్యారేజ్ కు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ వైరల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే.. వీరి వివాహాం అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోలోనే జరగడంవెనక పెద్ద రీజనే ఉంది. కుటుంబ సంప్రదాయాలు పాటిస్తూ, అక్కినేని విగ్రహం ముందు మ్యారేజ్ చేస్తే ఆయన ఆశీర్వాదం లభిస్తుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
అంతేకాదు నాగ చైతన్య.. అంతకు ముందు నాగార్జున.. అటు సుమంత్.. సుప్రియా అందరు విడాకుల బాధితులే. అందుకే ఇకపై వాళ్ల ఇంట్లో అలా జరగకుండా కాబోయే జంట జీవితాంతం సుఖంగా కలిసి ఉండేలా.. ఇప్పటికే ఓ హోమం కూడా నాగార్జున పండితులతో కలిసి నిర్వహించినట్టు తెలుస్తోంది.
పైగా తండ్రి విగ్రహం ఎదుట అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపిస్తే.. కాబోయే జంటకు మంచి జరగడంతో పాటు హీరోగా నాగ చైతన్య కెరీర్ కూడా టాప్ లో దూసుకుపోవడం ఖాయం అంటున్నారట. అందుకే వీరి పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోలో జరిపించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.