Naga Panchami 2024: దేశంలోనే శక్తివంతమైన 6 నాగ దేవత ఆలయాలు.. ఒక్కసారి దర్శిస్తే పదిజన్మల కాలసర్పదోషాలు మాయం..

Thu, 08 Aug 2024-1:13 pm,

శ్రావణ మాసంలో పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. శివుడు తనమెడలో, విష్ణుమూర్తి సర్పాలపై పవళించాడు. అదే విధంగా సుబ్రహ్మణ్యుడిని సర్ప అవతారంగా భావిస్తారు. నాగుల పంచమి రోజు ప్రతి ఒక్కరు పుట్టలో పాలు పోస్తారు. మన దేశంలో అనేక నాగదేవత ఆలయాలు ఉన్నాయి. వీటిని ఒక్కసారిగా దర్శించుకుంటే భయంకరమైన కాలసర్పదోషాలనుంచి ఉపశమనం పొంద వచ్చు.  

శ్రీ నాగద్వార్ స్వామి దేవాలయం పద్మశేష్ ఆలయం మధ్య ప్రదేశ్ లో ఉంది. శ్రీ నాగద్వార్ స్వామి దేవాలయం పద్మశేష్ పచ్మరిలో ఉంది. ఆలయం అనేది ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనదిగా చెప్తుంటారు. ఇక్కడ గతంలో నాగదేవతలను నివాసం ఉన్నారని అందుకే ఈ ఆలయం చుట్టుపక్కల తరచుగా సర్పాలు కన్పిస్తాయని చెప్తుంటారు. ఇక్కడ పూజలు చేయించుకుంటే ఎలాంటి దోషాలున్న కూడా ఇట్టే తొలగిపోతాయంట..  

తిరునాగేశ్వరం నాగనాథర్ ఆలయం రాహు స్తలం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని తమిళనాడులోని కుంభకోణం శివార్లలోని తిరునాగేశ్వరం అనే గ్రామంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం . దీన్ని 7 వ శతాబ్దంలో నిర్మించారని చెప్తుంటారు. ఇది గోపురాలు అని పిలువబడే నాలుగు గేట్‌వే టవర్‌లను కలిగి ఉంది . ఈ ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి, ఇందులో నాగనాథర్, రాహు, పిరైసూడి అమ్మన్ అత్యంత ప్రముఖమైనవి.  

భారతదేశంలోని గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భుజ్ పట్టణం శివార్లలో ఉన్న ఒక కొండ ఉంది.ఈ కొండపై నిర్మించిన భుజియా కోట పట్టణానికి అభిముఖంగా ఉంది. ఇక్కడ గుహాలో ప్రసిద్ధమైన నాగ ఆలయం ఉంది.  ఇక్కడ ఆలయంకు వెళ్లడం ఎంతో సాహాసంతో కూడుకున్నదని చెప్పవచ్చు.  

కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయం భారతదేశంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది. ఇక్క కార్తీకేయ స్వామి స్వయంభూగా వెలిసాడని చెప్తుంటారు. దివ్య సర్పమైన వాసుకి, ఇతర సర్పాలు గరుడుడిచే బాధించబడినప్పుడు.. సుబ్రహ్మణ్యుని క్రింద ఆశ్రయం పొందాయని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ ఆలయం కాలసర్పదోష నివారణకు ఎంతో ఫెమస్ అని చెప్పవచ్చు.

తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధమైన నాగరాజ ఆలయం ఉంది.ఇది 12 వ శతాబ్దంలో నిర్మించారని చెప్తుంటారు. ఈ ఆలయంలో మూడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పురాతన, ప్రధాన మందిరం యొక్క దేవత అసలు నాగరాజుగా మిగిలిపోయింది . రెండవ మందిరం రుక్మిణి, సత్యభామలతో కూడిన అనంతకృష్ణ (చుట్టిన పాముపై నృత్యం చేస్తున్న శిశువు కృష్ణుడు )కి అంకితం చేయబడింది. మూడవ మందిరం శివునికి అంకితం చేయబడింది .

మన్నరసాల శ్రీ నాగరాజ దేవాలయం  ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్తుంటారు. ఈ ఆలయం కేరళలో ఉంది. ఇక్కడ వేల సంఖయలో జంట నాగుల ప్రతిమలు ఉన్నాయని చెప్తుంటారు. ఇక్కడకు వచ్చి పూజలు చేసుకుంటే కాలసర్పదోషాలన్ని పోతాయంట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link