ANR National Awards 2024: అంగరంగ వైభవంగా జరిగిన అవార్డ్స్ ఫంక్షన్..ఏఎన్ఆర్ చివరి మాటలు ఇవే..

Mon, 28 Oct 2024-9:15 pm,

ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో.. అతిరథ మహారథుల సమక్షంలో.. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ఫంక్షన్ 2024 చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. 

ఈ సంవత్సరం ఈ ఏఎన్ఆర్ అవార్డ్స్ లో.. జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవి కి ఇస్తున్నట్లు.. కొద్ది రోజుల క్రితమే నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోనే హీరో నాగార్జున ప్రకటించారు. ఇప్పుడు ఆ పురస్కార ప్రధానోత్సవం .. అతిరథ మహారధుల మధ్య ఘనంగా జరిగింది.   

ఈ అవార్డుల ఫంక్షన్ కి చిరంజీవిని.. నాగార్జుననే స్వయంగా వెళ్లి ఇన్వైట్ కూడా చేశారు. ఇక ఈ అవార్డుల ఫంక్షన్ కి బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ కూడా వచ్చారు.   

ముఖ్యంగా ఈ ఈవెంత్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 

మరోపక్క నాగచైతన్య, శోభిత కూడా ఈ అవార్డు ఫంక్షన్లో కనిపించి అలరించారు. 

వీరితో పాటు రమ్యకృష్ణ, రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, చిరంజీవి అమ్మగారు అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు.అంతేకాదు తమ తండ్రి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది ఉత్తమ నటీనటులకు అందజేస్తున్న అక్కినేని జాతీయ అవార్డును అందుకోవాల్సిందిగా చిరంజీవిని కోరారు.

కాగా ఈ అవార్డుల ఫంక్షన్లో.. నాగేశ్వరరావు ఐసీయూ లో ఉన్నప్పుడు తాను చివరగా ఫ్యామిలీ గ్రూప్ లో పంపించిన ఆడియో మెసేజ్ వినిపించి అందరిని బాబోద్వేగానికి గురి చేశారు. అందులో ఏఎన్ఆర్ మాట్లాడుతూ.. “నాకోసం మీరంతా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారన్న విషయం.. తెలుసు. నా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు తెలియజేస్తూనే ఉన్నారు. మీ అభిమానానికి, ప్రేమకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెబుతున్నాను. త్వరలోనే నేను మీ ముందుకు మళ్లీ వస్తానన్న నమ్మకం నాలో ఉంది. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఇక సెలవు తీసుకుంటున్నా..” అంటూ చివరిసారిగా ఐసీయు నుంచి నాగేశ్వరరావు చెప్పిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link