Nogoba Jatara 2025: నాగోబా జాతరకు వేళాయే.. కేస్లాపూర్ లో మహాపూజ ఎప్పుడో తెలుసా..?
ఆదివాసులు నాగోబా జాతరను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ జాతరకు అనేక రాష్ట్రల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. రెండో అతి పెద్ద గిరిజన జాతరగా దీనికి పేరుఉంది.
ఆదిలాబాద్ లోని కేస్లాపూర్ లో ప్రతి ఏటా పుష్య మాసంలో నాగోబా జాతరను నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు ఈ జాతరను పండగలా నిర్వహిస్తారు . ఇక్కడ మేస్రం వంశీయులు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.
ప్రతి ఏడాది కూడా.. నాగ దేవతనకు.. పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. అంతే కాకుండా.. ఆ ఏడాది పెళ్లైన కొత్త కోడళ్లకు బేటింగ్..అంటే పరిచయం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తెలంగాణ ఏర్పడి నప్పటి నుంచి నాగోబా జాతరను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జాతరలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది. ఈ ఏడాది 28న పుష్య అమావాస్య కావడంతో ఆ రోజున అర్ధరాత్రి పూజలు చేసి.. జాతరను ప్రారంభిస్తారు. ఈ జాతరలో కీలమైన మూడోరోజు నిర్వహించే గిరిజన దర్బార్ ఈ నెల 31న నిర్వహిస్తారు.
జాతర ఏర్పాట్లన జిల్లా కలెక్టర్ అధికారులతో సమన్వయం చేసుకుని పనులు చేస్తున్నట్లు తెలుస్తొంది. అదే విధంగా నిజం నిరంకుశత్వనికి వ్యతిరేకంగా అనేక గిరిజన తెగలు అప్పట్లో పోరాడాయి. ముఖ్యంగా కొమురం భీం మొదలైన వారు.. నిజాంకు వ్యతిరేంగా పోరాడారు.
అదే విధంగా అప్పట్లో గిరిజనుల జీవన విధానంపై హైమండ్ డార్ఫ్ సైతం.. వచ్చి.. పలు ప్రాంతాలలో అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. అయితే.. సమ్మక్క సారాలమ్మ జాతర తర్వాత మాత్రం నాగోబా జాతరకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్తుంటారు.