Jr NTR: జూ.ఎన్టీఆర్ పై ఎందుకింత నెగిటివిటీ..? అతను నందమూరి వారసుడు కాదా..!

Sun, 29 Sep 2024-3:42 pm,
Balakrishna about Jr NTR

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద.. సంచలనం సృష్టిస్తున్నారు. మొదటి షో కి కేవలం యవరేజ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఆ తరువాత నుంచి మాత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటూ.. బాక్స్ ఆఫీస్ దగ్గర విజృంభిస్తోంది.   

Devara NTR

దేవర కలెక్షన్స్ లో తెగ ఆనందంలో ఉన్న నందమూరి అభిమానులకు.. ఐఫా అవార్డ్స్ లో బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం కొద్దిగా బాధను కలిగిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో.. బాలకృష్ణ తరువాత అంతటి పేరు సంపాదించుకుంది జూనియర్ ఎన్టీఆర్.   

Balakrishna Jr NTR

కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరుకి నందమూరి వారసుడే అయిన.. మిగతా స్టార్ హీరోల కొడుకుల లాగా.. ఎన్టీఆర్ కి ఎవరు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా సహాయ పడలేదు. తన స్వయంకృషి తోనే ప్రస్తుతం స్టార్ హీరోగా మారారు ఈ హీరో. మరోపక్క బాలకృష్ణ కి.. జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు ఎన్నో సోషల్ మీడియాలో వినిపిస్తూ వచ్చాయి.  

ఈ క్రమంలో బాలకృష్ణ ఐఫా అవార్డ్స్ లో చేసిన కొన్ని వ్యాఖ్యలు.. మరింత సెన్సేషనల్ గా మారాయి. ఈ మధ్య దుబాయిలో జరిగిన ఐఫా అవార్డ్స్ కి వెళ్ళిన బాలకృష్ణ.. అక్కడ జి మీడియాతో మాట్లాడుతూ.. తన వారసుడు కేవలం తన కొడుకు.. మనవడు.. మాత్రమే అని చెప్పుకొచ్చారు. 

సినీ పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీలో రామారావు వారసుడు బాలకృష్ణ.. బాలకృష్ణ వారసుడు ఎవరు అని అడగగా.. అందుకు సమాధానంగా..” నా కొడుకు.. నా మనవడు..ఇంకెవరున్నారు.” అని సమాధానం ఇచ్చారు బాలయ్య.   

అక్కడ కనీసం.. జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా ఎత్తలేదు. నిజం చెప్పాలంటే.. తెలుగు సినీ అభిమానుల్లో నందమూరి వారసులు అని అనగానే.. రామారావు, బాలకృష్ణ తరువాత  గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్ దే. అయినా ఎన్టీఆర్ పేరు చెప్పకపోవడం.. ప్రస్తుతం సాధారణ సినీ ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులను కూడా ఎంతగానో బాధపెడుతోంది. అంతేకాకుండా అసలు ఎన్టీఆర్ పైన ఎందుకింత నెగిటివిటీ అని కొంతమంది బాధపడుతున్నారు. 

సోషల్ మీడియాలో కూడా దేవర సినిమా బాగున్నా కానీ.. మరి ఎక్కువ నెగిటివ్ గా కామెంట్లు కనిపిస్తున్నాయి. మరోపక్క సోషల్ మీడియాలో సాధారణంగా కొంతమంది హీరోలకి వారి పీఆర్ టిమ్స్ ముందు పనిచేస్తూ ఉంటాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్.. కి అలాంటి టీమ్స్ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని కూడా కొంతమంది భావన.  ఎన్టీఆర్ కేవలం తన స్వయంకృషితోనే ఎదుగుతున్నారని..  సీనియర్ ఎన్టీఆర్ లాగానే .. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని అంటున్నారు ఆయన అభిమానులు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link