Nara Lokesh: రాజకీయాల్లో నారా లోకేశ్ సంచలనం.. వంగవీటి రాధాకృష్ణకు `పదవీ యోగం`
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అనారోగ్యం నుంచి కోలుకున్న విషయం తెలిసిందే.
ఢిల్లీ పర్యటన ముగించుకున్న నారా లోకేశ్ విజయవాడ చేరుకుని నేరుగా రాధాకృష్ణ నివాసానికి వెళ్లారు.
తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణ కుటుంబసభ్యులతో లోకేశ్ మాట్లాడి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. కొన్ని నిమిషాల పాటు అక్కడ గడిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణ పోటీ చేస్తారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ టీడీపీ అవకాశం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు రాధాకృష్ణకు ప్రాధాన్యం ఇస్తామని.. అధికారంలోకి వచ్చాక ఆయనకు గౌరవం ఉంటుందని ప్రకటించారు.
టీడీపీని వీడుతారని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు.
వంగవీటి రాధాకృష్ణ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్లారని కూడా ప్రచారం జరుగుతోంది. వీరి భేటీలో వంగవీటి రాధాకృష్ణకు పదవి ఇచ్చే అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.