Modi Cabinet 2024: నరేంద్ర మోడీ క్యాబినెట్ లో ఎంత మంది మాజీ సీఎంలు ఉన్నారంటే..?
నరేంద్ర మోడీ
నరేంద్ర మోడీ మూడోసారి భారత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. వరుసగా మూడు సార్లతో రికార్డు క్రియేట్ చేసారు. ఈయన ప్రధాని పదవి చేపట్టబోయే ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసారు.
రాజ్ నాథ్ సింగ్
నరేంద్ర మోడీ తర్వాత కేంద్ర మంత్రిగా నెంబర్ 2గా ప్రమాణ స్వీకారం చేసారు రాజ్ నాథ్ సింగ్. ఈయన గతంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసారు. మోడీ గత హయాంలో హోం, రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సారి రాజ్ నాథ్ ఏ పోర్ట్ పోలియో కేటాయిస్తారో చూడాలి.
శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్య ప్రదేశ్ కు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్.. తాజాగా మోడీ మూడో క్యాబినేట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.
మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానాలోని కర్నాల్ నుంచి లోక్ సభకు ఎన్నికైన మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. మోడీ మూడో మంత్రి వర్గంలో క్యాబినేట్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసారు.
కుమారస్వామి కర్ణాటకకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జేడీ(ఎస్)నేత కుమారస్వామి తొలిసారి నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.
జితన్ రామ్ మాంఝీ బిహార్ మాజీ సీఎం జితిన్ రామ్ మాంఝీ ..హిందూస్థాని అవామీ మోర్చా నాయకుడు ..నరేంద్ర మోడీ 3.Oలో కేంద్ర మంత్రి ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
సర్భానంద్ సోనేవాల్ సర్బానంద్ సోనేవాల్.. గతంలో అస్సామ్ ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఈయన నరేంద్ర మోడీ క్యాబినేట్ లో మరోసారి క్యాబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.