Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..

Sat, 25 May 2024-1:00 pm,

తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్‌ల తర్వాత 10 యేళ్లు పూర్తి చేసుకున్న తొలి కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు క్రియేట్ చేసారు.

2014 మే 26న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా నరేంద్ర మోదీతో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

 

2019లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా రెండోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాన మంత్రిగా తొలిసారిగా లోక్ సభ పోటీ చేసి గెలిచారు.

2001లో కేశుభాయ్ పటేల్ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2002లో జరిగిన గోద్రా అల్లర్లు నరేంద్ర మోదీకి పెద్ద పరీక్షపెట్టాయనే చెప్పాలి.

ఆ తర్వాత 2002, 2007, 2012లో వరుసగా మూడు సార్లు బీజేపీని గుజరాత్‌లో అధికారంలోకి తీసుకొచ్చారు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాల్గు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు కూడా మోదీ సొంతం.

2014 ఎన్నికల్లో తొలిసారి వారణాసి, వడోదర నుంచి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో వారణాసి లోక్ సభ స్థానాన్నిఉంచుకొని.. వడోదరకు రాజీనామా చేసారు.

2019లో కూడా వారణాసి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. ఇక 2024లో మూడోసారి అదే స్థానం నుంచి ఎంపీగా భారతీయ జనతా పార్టీ తరుపున బరిలో దిగారు.

మన దేశం నుంచి బతికి ఉండగానే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కొలువైన తొలి రాజకీయ నేతగా గుర్తింపు పొందారు.

అంతేకాదు తన హయాంలో అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370, త్రిపుల్ తలాక్, CAA వంటి ఎవరు టచ్ చేయడానికి భయపడే వాటిని చట్టాలుగా చేసిన ఘతన మోదీ ప్రభుత్వానికి దక్కుతోంది.

జన్ ధన్ యోజన, స్వచ్ఛ్ భారత్, ప్రపంచ యోగా దినోత్సవం ఆయుష్మాన్ భారత్, వందేభారత్,దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ వంటి ఎన్నో ప్రజా ఉపయోగ పనులతో ప్రజల గుండెల్లో నిలిచారు.

విదేశీ నాయకులతో సత్సంబంధాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. అంతేకాదు విశ్వనేతగా ఎదిగారు.

 

ఒకవేళ మూడోసారి నరేంద్ర మోదీ  పీఎం అయితే.. కాంగ్రెస్ యేతర తొలి ప్రధాన మంత్రిగా  రికార్డులకు ఎక్కనున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link