National Pension Schemes: వృద్ధాప్యంలో ఏ పెన్షన్ పధకం అధిక లాభాలు అందిస్తుంది
2014-15లో అప్పటి ఆర్ధిక మంత్రి ప్రసంగంలో చెప్పిన వివరాల ప్రకారం 60 ఏళ్లు పైబడిన పౌరుల ప్రయోజనం కోసం ఈ స్కీమ్ తిరిగి ప్రారంభించారు
ఈ పధకాన్ని ఎల్ఐసీ ద్వారా నిర్వహిస్తున్నారు. ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేస్తే ఏడాదికి 9 శాతం వడ్డీ గ్యారంటీగా లభిస్తుంది.
పేదలు, నిరాశ్రయులు, అసంఘటిత కార్మికుల కోసం అటల్ పెన్షన్ యోజన ప్రారంభించారు. ఇందులో 1000 రూపాయల్నించి 5000 వరకూ నెలకు పెన్షన్ లభించవచ్చు. ఈ పధకానికి 18-40 ఏళ్ల వయస్సువారు ఇన్వెస్ట్ చేయవచ్చు.
సీనియర్ సిటిజన్ల కోసం ప్రారంభించిన ఇందిరా గాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ప్రతి నెలా పెన్షన్ లభిస్తుంది. బీపీఎల్ కేటగరీ పరిధిలో వచ్చే 60-79 ఏళ్ల వృద్ధులరు నెలకు 300 రూపాయలు స్టైపెండ్ లభిస్తుంది. 80 ఏళ్లయితే ఆ పెన్షన్ కాస్తా 500 రూపాయలవుతుంది. ఈ పధకానికి ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేదు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో వృద్దాప్యాన్నిసెక్యూర్ చేసుకోవచ్చు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలుంటాయి. వృద్ధాప్యంలో ఆదాయమార్గం, మంచి రిటర్న్స్ వంటివి కలుగుతాయి.
నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. రిటైర్మెంట్ సేవింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ విధానమిది. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా వృద్ధాప్యంలో సెక్యూరిటీ ఉంటుంది. మంచి రిటర్న్స్ లభిస్తాయి. 60-65 ఏళ్ల భారతీయ పౌరులు ఎన్‌పీఎస్‌కు అర్హులు.