Navaratri 2024: నవరాత్రి 5వ రోజు మహాచండీ అలంకరణ.. పూజావిధానం, నైవేద్యం..
Navaratri 5th day alankarana: ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యాయి. 9 రోజులపాటు నవదుర్గలను పూజిస్తారు. ఒక్కోరోజు అమ్మవారిని ఒక్కో రూపంలో పూజిస్తారు. అయితే, 5వ రోజు మహాచండీ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే శత్రుపీడ తొలగిపోతుందని నమ్ముతారు. నవరాత్రులు పూజలు చేయలేని వారు కనీసం మూడు, ఐదు రోజులు అయినా పూజించాలి. ఇక ఐదవ రోజు మహాచండీ శక్తి స్వరూపిణీగా పూజిస్తారు.
పురాణాల ప్రకారం ఈ చండీ దేవి మహిషాసురునితోపాటు ఎంతోమంది రాక్షసులను చంపింది. లోకకల్యాణం కోసం అమ్మవారు అవతరించారు. ఏకాగ్రతతో మీరు కూడా అమ్మవారిని పూజిస్తే ధనధాన్యాలతోపాటు మంచి ఆరోగ్యం కూడా అమ్మవారు ఇస్తుంది.
మహా చండీ అమ్మవారిని పూజించడం వల్ల కాలసర్పదోషం, కుజదోషం తొలగిపోతుంది. ఈరోజు అమ్మవారికి నీలం రంగు చీరను ధరింపజేస్తారు. అంతేకాదు ప్రసాదంగా పులిహోర, గారెలు సమర్పించాలి. అయితే, ఈరోజు స్కంద మాతను కూడా పూజించే ఆచారం ఉంది.
నవరాత్రుల్లో కలశస్థాపన చేసుకుని పసుపు, కుంకుమ, అక్షితలతో కలిపి అమ్మవారిని పూజిస్తారు. కాగా, నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3న ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 12 శనివారం దసరా పండుగను జరుపుకోనున్నారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)