Navaratri 2020 Celebrations: సర్వాంగ సుందరంగా వైష్ణోదేవి ఆలయం
దేవీ నవరాత్రులు (Navaratri 2020 Celebrations) అక్టోబరు 17 నుంచి ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఆలయాలలో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. ఈ నెల 25 వరకు నవరాత్రులలో అమ్మవారు 9 రోజుల పాటు 9 రూపాల్లో దర్శనమిస్తారు. జమ్మూకాశ్మీర్‌లోని ప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయాన్ని (Vaishno Devi Temple in Jammu and Kashmir) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నవరాత్రి వేడుకలు శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. వైష్ణోదేవి ఆలయం ముస్తాబు ఫొటోలు ఇక్కడ వీక్షించండి.
తొలిరోజు శైలిపుత్రిగా అమ్మవారిని అంలకరిస్తారు. రెండో రోజు బాల త్రిపుర సుందరిగా, మూడోరోజు గాయత్రీదేవిగా, నాలుగోరోజు అన్నపూర్ణదేవిగా, ఐదోరోజు లలితా దేవిగా, ఆరోరోజు మహాలక్ష్మీ రూపంలో, ఏడోరోజు చదువుల తల్లి సరస్వతిగా, ఎనిమిదోరోజు దుర్గాదేవిగా, తొమ్మిదోరోజు అత్యంత ముఖ్యమైన రూపం మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఒక్కోరోజు ఒక్కో రకం వంటకాలను నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు.