Nayanthara: భర్తతో నయనతార స్టైలిష్ ఫోటో షూట్.. ఎంత ఘాటు ప్రేమ!

Sun, 07 Apr 2024-8:39 pm,

చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ నయనతార. ఆ తరువాత తులసి, లక్ష్మీ లాంటి సినిమాలలో నటించి సూపర్ సక్సెస్ సాధించింది.

తెలుగులో వరసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే తెలుగు కన్నా కూడా నయనతార కి తమిళంలో అభిమానులు మరింత ఎక్కువ.  

తమిళంలో నయనతారని ఏకంగా లేడీ సూపర్ స్టార్ అంటారు. ఆమెకు అక్కడ గుడి సైతం కట్టించాలని భావించారు అంటే.. అక్కడి వారి అభిమానం మనం అర్థం చేసుకోవచ్చు.

కాగా నయనతార చాలా రోజులు సినిమాల వల్లే కాకుండా తన ప్రేమ వ్యవహారాల వల్ల కూడా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. శింబు ఆ తరువాత ప్రభుదేవాన్ని ప్రేమించిన నయనతార ఇద్దరితో బ్రేకప్ అవ్వడం వల్ల.. దర్శకుడు విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లాడింది.

తాజాగా తన భర్త విగ్నేష్ శివన్ నయనతార తీసుకున్న ఫోటో షూట్ తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link