Nayanthara: ఆ సినిమా చేయడమే లైఫ్ లో తీసుకున్న చెత్త నిర్ణయం..నయనతార షాకింగ్ కామెంట్స్
రజినీకాంత్ చంద్రముఖి.. సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ నయనతార. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా వెంకటేష్ తో తీసిన లక్ష్మీ, తులసి రెండు చిత్రాలు కూడా నయనతార కి తెలుగులో మంచి విజయాలు అందించాయి.
అయితే నయనతార తెలుగు సినిమాల కన్నా కూడా.. తమిళంలో ఎక్కువగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు.. నయనతార ని లేడీ సూపర్ స్టార్ అంటూ..ప్రశంసలు కురిపించారు. తమిళంలో నయనతారకి ఉన్నంత ఫాలోయింగ్ అప్పట్లో.. ఇంకా వేరే హీరోయిన్ కి లేదు అంటే అతిశయోక్తి కాదు.
ఇక ఈ మధ్యనే బాలీవుడ్లోకి సైతం.. షారుఖ్ ఖాన్ జవాన్.. సినిమా ద్వారా అడుగుపెట్టింది. జవాన్ సినిమా మంచి విజయం సాధించటంతో.. ప్రస్తుతం హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా నయనతారకి.. వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కాగా కొద్ది సంవత్సరాల క్రితమే దర్శకుడు విగ్నేష్ శివన్ ని..పెళ్లి చేసుకుంది ఈ హీరోయిన్. ఆ తరువాత ఇద్దరూ బాబులకు సరోగసి ద్వారా.. జన్మనిచ్చింది. అయినా కానీ నయనతార సినిమాల జోరు మాత్రం తగ్గలేదు.
ఈ నేపథ్యంలో నయనతార.. ఒక సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే ఒక ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. సూర్య గజినీ సినిమా చేయడం తను జీవితంలో తీసుకున్న వరస్ట్ డెసిషన్ అంటూ కామెంట్స్ చేసింది. ఆ సినిమాలో తన పాత్రను తనకు చెప్పిన విధంగా చూపించలేదని.. అలానే తనను ఫోటోగ్రాఫర్ సరిగ్గా చూపించలేదని.. కామెంట్స్ చేసింది.
ఇక నయనతార తన కెరియర్ లో అంత బ్లాక్ బస్టర్గా నిలిచిన గజినీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. కాగా గజినీ సినిమాలో అసిన్.. మెయిన్ హీరోయిన్ కనిపించగా.. నయనతార సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.