Balakrishna Nominated Padma Bhushan: నందమూరి బాలకృష్ణని పద్మ భూషణ్ కి నామినేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

Mon, 21 Oct 2024-9:24 am,

Balakrishna Nominated Padma Bhushan: నందమూరి బాలకృష్ణ అన్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఓ నట వారసుడిగా టాలీవుడ్ చిత్ర సీమలో 50 నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు.

మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పొలిటికల్ హీరోగా రికార్డు నెలకొల్పారు.

 

అంతేకాదు బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పటల్ చైర్మన్ గా పేదలకు తక్కువ ధరకే క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తూ ఓ హీరోగా..ప్రజా ప్రతినిధిగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కొత్తగా కొలువు దీరిన సర్కారు..బాలయ్య సినీ, రాజకీయ, సేవా రంగాల్లో చేస్తోన్న సేవలకు గుర్తిస్తూ   2025 యేడాదికి గాను బాలయ్యను పద్మభూషణ్ కు నామినేట్ చేసినట్టు తెలుస్తోంది.

కేంద్రం ప్రతి యేడాది రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తూ రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 2025 యేడాదికి గాను ఏపీ నుంచి పలువురు పేర్లతో పాటు బాలయ్య పేరును నామినేట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో పాటు కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు ఈయనకు ఎపుడో రావాల్సిన ఈ అవార్డు ఆలస్యంగా ఇస్తున్నట్టు కూడా చెబుతున్నారు.

బాలయ్య విషయానికొస్తే.. తండ్రి ఎన్టీఆర్ నట వారసుడిగా జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ చిత్రాలతో తనదైన ముద్ర వేసారు. తన తరంలో అన్ని జానర్స్ ను టచ్ చేసిన హీరోగా రికార్డు క్రియేట్ చేసారు.

బాలయ్య సినిమాల విషయానికొస్తే.. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హాట్రిక్ విజయాలను అందుకున్నారు. త్వరలో బాబీ దర్శకత్వంలో చేస్తోన్న 109వ చిత్రంతో పలకరించబోతున్నాడు.

ఈ చిత్రానికి ‘డాకూ మహారాజ్’ లేదా ‘సర్కారు సీతారామ్’ సినిమాల పేర్లను రిజిస్టర్ చేసారు. ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారనేది చూడాలి. మరోవైపు బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ తాండవం’ పేరుతో కొత్త సినిమాను ప్రారంభించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ఏది ఏమైనా బాలయ్య సేవలను గుర్తిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. బాలయ్యను పద్మ భూషణ్ తో గౌరవిస్తుందా లేదా అనేది తెలియాలంటే 2025 రిపబ్లిక్ డే వరకు ఆగాల్సిందే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link