Neha Shetty: చీరకట్టులో మరింత అందంగా టిల్లు భామ నేహా శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Tue, 07 May 2024-2:59 pm,

కన్నడ భామ అయిన నేహా శెట్టి.. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో పరిచయమైంది.

నేహా శెట్టి తన మాతృ భాష కన్నడలో విడుదలైన 'ముంగారు మేల్ 2' మూవీతో  వెండితెర తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించి ఈ అమ్మడికి మంచి పేరు తీసుకొచ్చింది.

 

ఆ తర్వాత కన్నడలో 'గల్లీ రౌడీ' సినిమాతో పలకరించింది నేహా. అటు అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్నపాత్రలో మెరిసింది ఈ భామ. 

ఇక డిజే టిల్లు వరకు నేహా గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఈ సినిమా విజయం తర్వాత నేహా శెట్టికి  వరుస ఆఫర్స్ వచ్చినా.. ఆమె ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. అంతేకాదు వీలైనపుడల్లా.. తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇక సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది. తాజాగా మరోసారి 'టిల్లు స్క్వేర్' మూవీతో ప్రేక్షకులను కాసేపు అలా పలకరించింది వెళ్లింది.

ప్రస్తుతం నేహా శెట్టి ఈమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాపై ఈ అమ్మడు మంచి హోప్స్ పెట్టుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link