Neha Shetty Viral pics: చీరకట్టులో పిచ్చెక్కిస్తున్న నేహా శెట్టి, లేటెస్ట్ పిక్స్ వైరల్
ఒకప్పుడు టాలీవుడ్ లో మలయాళ భామల హవా ఎక్కువ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో కన్నడ బ్యూటీల తాకిడి ఎక్కువైంది. అలా కన్నడ నుంచి వచ్చిన అందాల సోయగమే నేహా శెట్టి.
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన 'మెహబూబా' సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది నేహా. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
డీజే టిల్లు మూవీతో యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో రాధిక పాత్రలో అద్భుతంగా నటించింది.
గత కొంత కాలంగా ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. దీంతో నేహా గ్లామర్ డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల గుండెల్లో చిచ్చుపెడుతున్నాయి.