Neha Shetty: నేహా శెట్టి వయ్యారాలు చూడతరామా.. లేటెస్ట్ ఫోటోస్ చూస్తే చూపు తిప్పుకోలేరు..

Mon, 08 Apr 2024-3:44 pm,

శాండిల్ వుడ్ భామ అయిన నేహా శెట్టి.. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో తెరంగేట్రం చేసింది.  

  నేహా శెట్టి తన సొంత భాష కన్నడలో విడుదలైన 'ముంగారు మేల్ 2' మూవీతో  కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.

ఆ తర్వాత 'గల్లీ రౌడీ' సినిమాతో పలకరించింది నేహా. అటు అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్నపాత్రలో నటించింది.

ఇక సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి పేరు పాపులర్ అయింది.  ఆ తర్వాత 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీల్లో మెరిసింది.  తాజాగా మరోసారి 'టిల్లు స్క్వేర్' మూవీతో ప్రేక్షకులను కాసేపు అలా పలకరించి వెళ్లింది.

డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన గ్లామర్ షోతో  సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ప్రెజెంట్ నేహా శెట్టి ఈమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో యాక్ట్ చేస్తోంది.  ఈ సినిమాపై ఈ అమ్మడు మంచి హోప్స్ పెట్టుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link