Neha Shetty: వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే..

Wed, 14 Aug 2024-8:20 am,

నేహా శెట్టి..  కన్నడ  చిత్రసీమలో  'ముంగారు మేల్ 2' చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అక్కడ యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. 

తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో  ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి. 

మంగళూరు బ్యూటీ అయిన నేహా ఆ తర్వాత కన్నడలో'గల్లీ రౌడీ'సినిమాలో నటించింది. అటు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'మూవీలో ఓ చిన్న పాత్రలో నటించి మెప్పించింది.

సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి కెరీర్ పూర్తిగా ఛేంజ్ అయిపోయింది. డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు తెలుగులో వరుస ఆఫర్స్ పలకరించాయి. 

ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీలో నేహా శెట్టి  కాసేపు అలా పలకరించింది.

లాస్ట్ ఇయర్ 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది. ఇందులో బెదరులంక ఓ మోస్తరుగా నడిచింది. సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన గ్లామర్ తో షేక్ చేస్తోంది.

రీసెంట్ గా  నేహా శెట్టి.. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ చిత్రంతో  పలకరించింది. ఈ సినిమా  ఓ మోస్తరు విజయం సాధించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link