Business Tips 2023: రూ.15 వేలతో పెట్టుబడి ప్రారంభించండి.. మూడు నెలల్లోనే రూ.4 లక్షలు సంపాదించండి

Sat, 25 Feb 2023-8:49 pm,

హిందూ మతంలో తులసికి ఆధ్యాత్మికంగా.. ఆయుర్వేద పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. అంతే కాకుండా తులసి మొక్క మిమ్మల్ని లక్షాధికారిని కూడా చేస్తుంది. తులసి మొక్కను పెంచడం ద్వారా మీరు సులభంగా లక్షలు సంపాదించవచ్చు.   

ప్రస్తుతం ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మందులు కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ మందులన్నింటి తయారీలో తులసిని ఉపయోగిస్తారు. అందుకే తులసికి భారీగా డిమాండ్ పెరుగుతోంది.  

జూలై నెలలో తులసి సాగు చేస్తారు. సాధారణ మొక్కను 45x45 సెం.మీ దూరంలో నాటాలి. కానీ RRLOC 12, RRLOC 14 జాతుల మొక్కలకు 50x50 సెం.మీ దూరం ఉంచాలి. ఈ మొక్కలు నాటిన తర్వాత నీటి సదుపాయం కల్పించడం చాలా అవసరం.

తులసి మొక్కను కోయడానికి 10 రోజుల ముందు నీళ్లను పెట్టడం నిలిపివేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మొక్క పెరిగినప్పుడు పంట తీస్తారు. మొక్క పుష్పించడం ప్రారంభించిన తరువాత.. దాని నూనె పరిమాణం తగ్గుతుంది. అందుకే ఈ మొక్కలు పుష్పించే సమయంలోనే కోయాలని చెబుతున్నారు.

మొక్కలను మార్కెట్‌లో అయినా.. ఏజెంట్‌ను సంప్రదించి అయినా విక్రయించవచ్చు. మీరు కాంట్రాక్ట్ వ్యవసాయం చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీలు లేదా ఏజెన్సీలకు కూడా మొక్కలను అమ్మవచ్చు. ఈ కంపెనీలు తులసికి అధిక ధరను చెల్లించి కొనుగోలు చేస్తున్నాయి. 

అయితే తులసి సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. అలాగే పెద్దగా భూమి కూడా అవసరం లేదు. మీరు కేవలం రూ.15 వేలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

తులసిని నాటిన తరువాత కోతకు ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు. దీని ప్లాంట్ మూడు నెలల్లోనే సిద్ధమవుతుంది. తులసి పంటను దాదాపు రూ.3 నుంచి 4 లక్షల వరకు విక్రయిస్తారు. ఆయుర్వేద మందులు తయారు చేసే కంపెనీలు కాంట్రాక్టుపై వ్యవసాయం చేస్తున్నాయి. డాబర్, వైద్యనాథ్, పతాంజలి లాంటి ఎన్నో కంపెనీలతో కాంట్రాక్టు వ్యవసాయం చేసుకోవచ్చు.

(గమనిక: ఇక్కడ వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన గురించి మాత్రమే సమాచారం ఉంది. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు.. మీరు సంబంధిత రంగంలోని నిపుణుల నుంచి సలహా తీసుకోవాలి. దీంతో పాటుగా లాభాల గణాంకాలు మీ వ్యాపార విక్రయంపై ఆధారపడి ఉంటాయి.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link