New Pension Scheme Rules: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్..కొత్త పెన్షన్ స్కీం రూల్స్ ఇవే

Thu, 24 Oct 2024-4:46 pm,

New Pension Scheme: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ కు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా పెన్షనర్లు పెన్షనర్ల సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి పెన్షన్ల నియంత్రించే అనేక నియమాలను సవరించింది. ఇందులో భాగంగా ఎవరైతే నేషనల్ పెన్షన్ స్కీం కింద కొత్త పెన్షన్ విధానాన్ని ఎంపిక చేసుకున్నారో వారికి ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.

ఎవరైతే కేంద్ర ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ విధానం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో వారికి మాత్రమే ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మార్పులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రూల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.  

ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంపీఎస్ పరిధిలోకి వస్తారో వారు 20 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించే ముందు కనీసం మూడు నెలల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పదవి విరమణ ప్రక్రియ సులభతరం అవుతుంది.  

ఎవరైతే పదవి విరమణ నోటీసు అందిస్తారో అలాంటి వారికి తప్పనిసరిగా పై అధికారి నోటీసును ఆమోదించాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే అధికారి మీ నోటీసును ఆమోదించరో అప్పుడు కూడా ఒక పరిష్కారం ఉంది. నోటీసు ఇచ్చిన తర్వాత ఒకసారిగా మూడు నెలలకు మీ పదవీ విరమణ  ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఆమోదం పొందుతుంది.   

ఇదిలా ఉంటే ఎవరైతే ఉద్యోగి స్వచ్ఛంద పదవి విరమణ అప్లై చేసుకున్నారు. వారు నోటీసు పిరియడ్ కన్నా ముందు కూడా తమను రిలీవ్ చేయమని కోరవచ్చు. అయితే అత్యవసర కారణాలు ఏమైనా ఉంటే వాటిని మీరు మీ అప్లికేషన్లు తెలుపవచ్చు. మీకు ఇమీడియట్ గా రిలీవ్ కావాలి అంటే మీపై అధికారి నుంచి ఆమోదం పొందాల్సి ఉంటుంది. మూడు నెలలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిన పనిలేదు.   

అయితే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా పదవీ విరమణ చేసిన లేక టెర్మినేషన్ సస్పెన్షన్ వంటివి గురైన వారి పెన్షన్ కార్పస్ అలాగే యాన్యుటిని ఏక మొత్తంలో ఒకేసారి అందుకుంటారు.  

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఎయిట్ పే కమిషన్ కూడా అతి త్వరలోనే అమలులోకి రానుంది. దీనికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం చివరి నాటికి ఎయిట్ పే కమిషన్ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link