Bank Rules Changed: 2020: డిసెంబర్ నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్

Mon, 07 Dec 2020-10:58 am,

ప్రపంచం మొత్తం ఇలాంటి సంవత్సరాన్ని ఎప్పుడూ చూసి ఉండదు. అలాంటి ఈ సంవత్సరం చివరి నెల ఎప్పుడు గడుస్తుందా అని చాలా మంది వేచి చూస్తుంటారు. అందులో మీరు అయితే వచ్చేే నెల నుంచే కొన్ని మార్పులు జరగనున్నాయి.. వాటికి కూడా సిద్ధంగా ఉండండి.

 మొత్తం 17 మెయిల్, ఎక్స్ ప్రెస్ ట్రైన్లను నవంబర్ 24న పంజాబ్ నుంచి ప్రారంభించాలి అని రైల్వేస్ భావిస్తోంది. ఈ సర్వీస్ డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది అని సమాచారం.

డిసెంబర్ 1వ తేదీ నుంచి LPG Cylinder ధరల్లో మార్పులు , రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ ( RTGS ) ఇలా పలు అంశాల్లో కీలకమైన మార్పులు కనిపించనున్నాయి. ఈ మార్పులు సామాన్యుడి జీవితంపై చాలా ప్రభావం చూపించనున్నాయి.

Also Read |  సూపర్ ఫీచర్స్ తో Toyota Innova Crysta ను లాంచ్ చేసిన Totoya, ధర ఇతర వివరాలు తెలుసుకోండి.

అక్టోబర్ 2020లో రిజర్వ్ బ్యాంకు ఒక కీలక ప్రకటన చేసింది. అందులో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ ను భారీ మొత్తంలో నగదు లావాదేవీలకు వినియోగించే అవకాశం గురించి తెలిపింది. డిసెంబర్ 2020 నంచి ఇది అమలులోకి రానుంది. దీని ప్రకారం ఇక మనం డిసెంబర్ నుంచి ఎలాంటి సమయ పరిమితి లేకుండా ఆర్ధిక లావాదేవీలు నిర్వహించవచ్చు.

Also Read |  PUBG Mobile India: పబ్ జీ  ఇక ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమేనా ? పూర్తి వివరాలు చదవండి

కొన్ని మీడియా సంస్థల ప్రకారం హోస్ ట్రైన్ సర్వీసులు డిసెంబర్ 2020 నుంచి అందుబాటులోకి రానున్నాయి అని సమాచారం. అందులో పంజాబ్ మెయిల్, జీలమ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు కూడా ఉన్నాయి.

ఇక నుంచి గ్యాస్  సిలిండర్ ధరలు నిత్యం మారనున్నాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ ధరలను డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రతీ రోజు మార్చే అవకాశం ఉంది.  

గ్యాస్ ధరలు అనేవి ఇక అంతర్జాతీయ మార్గెట్ ఆధారంగా మారనున్నాయి. అంటే ఆయిల్ మార్కెట్ సంస్థలు ప్రతీ రోజు LPG Cylinder ధరలను మార్చే అవకాశం ఉంది.

Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link