Teachers Salary: తెలంగాణ డీఎస్సీ కొట్టి కొత్తగా జాయినయ్యే టీచర్ల జీతం ఎంతో తెలుసా?
అత్యధిక జీతాలు: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. గత సీఎం కేసీఆర్ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచారు.
పత్రాల అందజేత: తాజాగా తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు అందించిన విషయం తెలిసిందే.
అవకతవకలు: అయితే ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఉద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఆడంబరంగా పత్రాలు: ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా మొండిగా నియామకాలు చేపట్టింది. ఎల్బీ స్టేడియంలో ఆడంబరంగా పత్రాలు అందించింది.
జీతభత్యాలు: అయితే కొత్తగా నియమితులైన టీచర్లకు ఎంత జీతం వస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
జీతాలు వేర్వేరుగా: పట్టణ ప్రాంతంలో ఒకలా.. గ్రామీణ ప్రాంతాల్లో మరోలా ఉపాధ్యాయులకు జీతభత్యాలు ఉన్నాయి.
ప్రాంతాలను బట్టి: హెచ్‌ఆర్‌ఏ గ్రామీణ ప్రాంతాలకు 30 శాతం, జిల్లాలవారీకి 20 శాతం ఉంటుంది. ఈ కారణంగా జీతభత్యాల్లో వ్యత్యాసాలు ఉంటాయి.
జీతం వివరాలు: ఎస్జీటీ పోస్టులకు మొత్తం జీతం: 43,068. జీతం:31,040, హెచ్‌ఆర్‌ఏ (11%) రూ.3,414, డీఏ (22.75%) 7,062, ఐఆర్ రూ.1,552
ఎస్ఏ టీచర్లకు: స్కూల్ అసిస్టెంట్: మొత్తం జీతం: 58,691. జీతం:42,300, హెచ్‌ఆర్‌ఏ (11%) రూ.4,653, డీఏ (22.75%) రూ.9,623, ఐఆర్ రూ.2,115