Nidhhi Agerwal: ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీ నుండి నిధి అగర్వాల్ లుక్ లీక్.. పిక్ వైరల్..
నిధి అగర్వాల్ బాలీవుడ్ మూవీ ‘మున్నా మైఖేల్’ మూవీతో వెండితెరకు పరిచయమైంది. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన తొలి సినిమాలోనే తన పరువాల ఆరబోతతో సెగలు పుట్టించింది. ఆ తర్వాత తెలుగులో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సవ్యసాచి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
ఇస్మార్ట్ శంకర్ హిట్టైన నిధికి తెలుగులో అనుకున్నంత రేంజ్ లో ఆఫర్స్ రావడం లేదు. త్వరలో ఒకేసారి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తూన్న ‘ది రాజా సాబ్’ మూవీలతో పలకరించబోతుంది. ఈ రెండు సినిమాలు రెండు వారాల గ్యాప్ లో విడుదల కాబోతున్నాయి.
తాజాగా నిధి అగర్వాల్ ప్రభాస్ ‘ ది రాజాసాబ్’ మూవీలో ఈమెకు షూటింగ్ కు సంబంధించిన పిక్ ఒకటి లీకైంది. దాన్ని సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ప్రభాస్ సరసన తొలిసారి యాక్ట్ చేస్తుండటంతో నిధి ఆనందానికి పట్టపగ్గాలు లేవు.
మొత్తంగా వచ్చే యేడాది నిధి అగర్వాల్ కెరీర్ కు ఎంతో కీలకం అని చెప్పాలి. ఇద్దరు బడా స్టార్స్ సరసన నటించడంతో పాటు ఈ రెండు సినిమాలు రెండు వారాల వ్యవధిలో విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.