Nidhhi Agerwal Pics: అయ్యో పాపం.. అందాల `నిధి` అగర్వాల్‌కు ఏమైంది!

Fri, 29 Jul 2022-9:05 pm,

సినిమాలతో బిజీబిజీగా ఉన్నా.. హాట్ ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తున్నారు నిధి అగ‌ర్వాల్‌. తాజాగా పొట్టి శారీలో దర్శమిచ్చారు. అయితే ఈ ఫోటోలలో నిధి గదవ కాస్త ఉబ్బినట్టుగా కనిపిస్తోంది. దాంతో  అందాల 'నిధి' అగర్వాల్‌కు ఏమైంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.   

నిధి అగ‌ర్వాల్‌ ఇటీవలి కాలంలో తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.   

ఇటీవల తెలుగులో అశోక్ గల్లా నటించిన 'హీరో' సినిమాలోనూ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో నిధి అందాల ప్రదర్శన చేశారు. ముద్దు సన్నివేశాల్లో కూడా నటించి హద్దులు దాటారు.   

ఇక ఎనర్జటిక్ హీరో రామ్ హీరో నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిధి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ అలరించారు.   

అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించి నిధి అగర్వాల్ పర్లేదు అనిపించుకున్నారు. ఈ సినిమాలో కూడా గ్లామర్ మెరుపులతో అందరినీ ఆకర్షించారు.   

నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో అందాల భామ నిధి అగర్వాల్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా నిధి నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link