Nidhhi Agerwal: క్యూట్ లుక్స్ తో మత్తెక్కిస్తున్న నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటో షూట్.. చూస్తూ చూపు తిప్పుకోలేరేమో..!

Wed, 28 Aug 2024-1:29 pm,

నిధి అగర్వాల్..బాలీవుడ్ చిత్రం టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్'మూవీతో హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.  

తెలుగులో  అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ‘సవ్యసాచి’ మూవీతో తెరంగేట్రం చేసింది నిధి అగర్వాల్.  నిధి అగర్వాల్‌కు నార్త్, తెలుగులో కంటే తమిళంలో హీరోయిన్‌గా దూకుడు మీదుంది. ముఖ్యంగా తమిళ అభిమానులతో నిధికి గుడి కట్టించుకునే రేంజ్‌కు ఎదిగింది.

నిధి అగర్వాల్.. ముంబైలో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా  తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్‌’తో ఈమె కెరీర్  జెడ్ స్పీడ్ లా దూసుకుపోయింది.  

త్వరలో పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాతో పలకరించబోతుంది  నిధి అగర్వాల్. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది.

అటు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తూన్న ‘ది రాజా సాబ్’ సినిమాలో కూడా ఆమె మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై  నిధి అగర్వాల్ భారీ ఆశలే పెట్టుకుంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link