Nirjala ekadashi 2024: నిర్జల ఏకాదశి.. ఈ పరిహరాలు పాటిస్తే అఖండ ధనంతో పాటు శీఘ్రంగా పెళ్లి యోగం..

Tue, 18 Jun 2024-6:25 am,

మనకు ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. అంటే నెలకు రెండుమార్లు ఏకాదశి తిథి  వస్తుంది. ఏకాదశి తిథి అనేది శ్రీ మహవిష్ణువుకు ఎంతో ఇష్టమైనదిగా చెబుతుంటారు.  ఈరోజున ఆ విష్ణువుతో పాటు, శ్రీ మహాలక్ష్మీ దేవీని భక్తితో పూజిస్తే మనకు ఊహించని ధనలాభం కల్గుతుంది. 

నిర్జల ఏకాదశి రోజు బ్రాహ్మీ మూహుర్తంలో నిద్రలేవాలి. తలస్నానం చేసి, పూజగదిని శుభ్రం చేసుకొవాలి. మార్కెట్ లో లభించే ప్రత్యేకమైన పూలు, పండ్లను తీసుకుని వచ్చి దేవుడికి నివేదించాలి. శ్రీ మహ విష్ణువు అలంకార ప్రియుడిగా చెబుతుంటారు. అందుకే ఆయనను ప్రత్యేకమైన పూలతో డెకోరేట్ చేయాలి.

ఏకాదశి తిథిరోజు తెల్లని పూలు,  తులసీలతో మాలలు చేసి శ్రీ మహవిష్ణువుకు సమర్పించాలి. ఈ రోజున చాలా మంది భక్తులు ఉపవాసం వ్రతం కూడా చేస్తారు. ఉపవాసం చేయలేని వారు, ఏక భుక్త  వ్రతం కూడా చేయోచ్చని పండితులు చెబుతుంటారు.

ఈరోజున ఏ  వ్రతం, ఎలాంటి దానాలు చేసిన వందరెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుందని పురాణాలలో చెప్పబడింది.. అందుకే నిర్జల ఏకాదశి రోజున.. పేదలకు వస్త్రదానం, అన్నదానం చేయాలి. తమకు ఉన్న శక్తి మేరకు పేదవాళ్లకు పెళ్లిలో సహయం చేయాలి..

ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మీ దేవీ అనుగ్రహంతో అఖండ ధనయోగంతో పాటు, శీఘ్రంగా పెళ్లి కుదురుతుందని జ్యోతిష్య పండితులుచెబుతుంటారు. చాలా మంది యువత ఇటీవల కాలంలో పెళ్లిళ్లు కుదరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారు ఈ రోజున ఈ పరిహరాలు పాటిస్తే మంచి జరుగుతుందని పండితుల అభిప్రాయం.

ఏకాదశి రోజున శ్రీ సత్యనారాయణ వ్రతను భక్తి, శ్రద్ధలతో చేస్తే.. వారికి జీవితంలో ఏ విషయాల్లోను  కూడా .. తక్కువ ఉండదని పండితులు చెబుతున్నారు.  ఇంకా.. రావి చెట్టు కింద నెయ్యితో దీపారాధన చేయాలి. నల్ల చీమలకు చక్కెర లేదా బెల్లంను ఆహరంగా వేయాలి. పేదలకు , స్వీట్లు, పండ్లను పంచి పెట్టాలి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link