Nisha Agarwal: పొట్టి డ్రెస్ లో నిషా అగర్వాల్ హాట్ ఫోటో షూట్.. పెళ్లైనా ఎక్కడా తగ్గడం లేదుగా..

Tue, 13 Aug 2024-10:38 am,

నిషా అగ‌ర్వాల్.. కాజల్ అగర్వాల్ సిస్టర్ గా తెలుగు సినీ  పరిశ్రమలో అడుగుపెట్టింంది.  అంతేకాదు అక్క కాజల్ కు దక్కిన లక్  నిషాకు దక్కలేదనే చెప్పాలి.  

 

నిషా అగ‌ర్వాల్.. మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి అక్క బాటలో  'ఏమైంది ఈ వేళ' మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది.ఈ సినిమా ఒళ్లు దాచుకోకుండా చేసినా.. పెద్దగా ఉపయోగపడలేదు. 

ఆ తర్వాత తెలుగులో అర డజనుకు పైగా సినిమాల్లో నటించినా... పెద్దగా స్టార్ డమ్ మాత్రం దక్కలేదు నిషా అగ‌ర్వాల్. 

2010లో హీరోయిన్‌గా కెరీర్ మొదలు స్టార్ట్ చేసిన‌ నిషా.. చివరగా 2014లో మలయాళ మూవీ 'కసిన్'సినిమాతో పలకరించింది. ఈ చిత్రం ఈ అమ్మ‌డి కెరీర్‌కు పెద్ద‌గా ఉపయోగపడింది లేదు.

 

నిషా..వ‌రుస‌గా ఫ్లాపులు ప‌ల‌కరించ‌డంతో  సినిమాలకు గుడ్ బై చెప్పి పెళ్లి  చేసుకొని జీవితంలో సెటిలైపోయింది. అపుడపుడు తన అక్క కాజల్ అగర్వాల్‌తో పాటు తన కుమారుడి ఫోటోలను షేర్ చేస్తూ   సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link