Nita Ambani Gift: నీతా అంబానీకి చిన్న కోడలు అంటేనే ఇష్టమా..పెద్ద కోడలు కన్నా చిన్నకోడలికే.. అత్యంత ఖరీదైన గిఫ్ట్
Nita Ambani gifts Anant Ambani's wife Radhika Merchant : ప్రముఖ వ్యాపారవేత్త, అపరకుభేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలు ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా చేసిన సంగతి తెలిసిందే. ఈ జంట వివాహం జులై 12వ తేదీ ముంబైలో ఘనం జరిగింది. జులై 14న గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించారు. అయితే నీతా అంబానీ తన చిన్న కోడలుకు అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
అనంత్, రాధిక మర్చంట్ ల వివాహానికి అంబానీ కుటుంబం దాదాపు రూ 1,259 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అంబానీ అంటే ఆమాత్రం ఉండాల్సిందే అంటూ నిరూపించారు. ఈ పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖలు హాజరయ్యారు.
అంబానీ ఫ్యామిలీ ఏ పని చేసినా వార్తల్లో హైలెట్ అవుతుంటారు. అనంత్ వివాహం జరిగినప్పటి నుంచి రోజుకో వార్తతో ట్రెండింగ్ లో ఉంటోంది అంబానీ ఫ్యామిలీ. ఈ మధ్యే పారిస్ ఒలింపిక్స్ కు హాజరైన కొత్త జంట..అక్కడ ఎంజాయ్ చేశారు. అంతేకాదు అత్యంత ఖరీదైన రిసార్ట్ లో వారు హనీమూన్ కు వెళ్లారు.
ఇక ఇప్పుడు నీతా అంబానీ తన కోడళ్లకు ఇచ్చిన అత్యంత ఖరీదైన బహుమతులతో మరోసారి వార్తల్లో నిలిచారు. నీతా అంబానీ తన చిన్న కోడలు రాధికా మర్చంట్ కు దుబాయ్ ఒక విలాసవంతమైన విల్లాను బహుమతిగా ఇచ్చారట. దీని ఖరీదు రూ. 640కోట్ల వరకు ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి.
2022 ఏప్రిలో ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ కోసం దుబాయ్ లో పామ్ జుమేరాలో విలాసవంతమైన బీచ్ సైడ్ విల్లాను కొనుగోలు చేశారు. 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లాలో 10 బెడ్ రూమ్స్, 70 మీటర్ల ప్రైవేట్ బీచ్ ఉంది. ఇది దుబాయ్ లో రెండవ అతిపెద్ద నివాస స్థలం.
ఇక నీతా తన పెద్ద కోడలు శ్లోకా మెహతాకు డైమండ్ చోకర్ బహుమతిగా ఇచ్చారు. దీని ఖరీదు రూ. 451 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ గిఫ్టుగా ఇచ్చారు. 2019లో ఆకాశ్ అంబానీతో శ్లోకా మెహతా వివాహం జరిగింది. ఆ సమయంలో 91 వజ్రాలతో తయారు చేసిన ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల నెక్లెస్ ను బహుకరించారు.
అంతేకాదు అనంత్, రాధికా నిశ్చితార్థం 2023లో జరిగింది. ఆ సమయంలో రాధికాకు రూ. 4.5కోట్ల విలువైన బెంట్లీ కాంటినెంటల్ డైమెండ్ నెక్లెస్ ను బహుమతిగా ఇచ్చారు. పెద్ద కోడలికి చిన్న గిఫ్ట్...చిన్న కోడలికి పెద్ద గిఫ్ట్ ఇచ్చారు నీతా అంబానీ అంటూ నెట్టింట్లో ఒక్కటే చర్చ మొదలైంది. నీతాకు పెద్ద కోడలి కంటే చిన్న కోడలిపైనే ఎక్కువ ప్రేమ ఉందాంటూ గుసగుసలు పెడుతున్నారు.