Nivetha Thomas : రెడ్ డ్రెస్ లో నివేదా థామస్ రచ్చ
నివేదా థామస్ 1995, నవంబర్ 2న జన్మించింది. నివేదా థామస్ తండ్రి తామస్ ఇయన బిజినెస్ మేన్. తల్లి పేరు లిల్లీ. నివేదాకు నిఖిల్ అనే తమ్ముడున్నాడు . నివేదాను ఇంట్లో అందరూ బేబీ అని పిలుస్తారట.(Courtesy: Instagram photos)
నివేదా థామస్ పుట్టింది కేరళలోనే అయినా విద్యాభ్యాసం మొత్తం తమిళనాడులోని చెన్నలోనే. మోడల్‌గా రాణిస్తూ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమా అవకాశాలను దక్కించుకుంది ఈ భామ. (Courtesy: Instagram photos)
2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా. సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ మై డియర్ బూతంలో కూడా నటించింది. మలయాళం సినిమా 'వెరుథె ఒరు భార్య' సినిమాలో జయరాం కుమార్తెగా నటించింది. అలాగే చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించింది. (Courtesy: Instagram photos)
అంచెలంచెలుగా ఎదుగుతూ తన దైన నటనతో ప్రశంసలందుకుంది నివేదా. టాలీవుడ్ డెబ్యూ మూవీతో జెంటిల్‌మేన్‌లో బాగా ఆకట్టుకుంది. ఆ తరువాత నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ, 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ 118, వీ తదితర సినిమాలతో కర్రకారు మనసు దోచుకుంది. (Courtesy: Instagram photos)
నివేదా థామస్ లేటెస్ట్ హిట్ వకీల్ సాబ్‌లో అద్భుతంగా నటించి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. ఈ బ్యూటీ ఇటీవల ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించింది. (Courtesy: Instagram photos)