Nominee For Motor Vehicles: వాహనదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..!

Sat, 28 Nov 2020-10:14 am,

వాహనదారులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు శుభవార్త చెప్పింది. త్వరలో మోటారు వాహనాలకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. వాహనాలు కొనుగోలు చేయడం మధ్యతరగతి వారికి ఎంత కష్టమో తెలిసిన విషయమే. కొన్న తర్వాత ఇంధనం కోసం చేసే ఖర్చులు సామాన్యుడి బడ్జెట్‌పై మరింత భారాన్ని పెంచుతాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.

సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్, యాక్ట్ 1989కు సవరణ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేసింది. బ్యాంకు, ఇతరత్రా ఖాతాలకు ఉన్న మాదిరిగానే వాహనాలకు కూడా ఓ నామినీ పేరు చేర్చే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటివరకే వాహనాల ఓనర్‌షిప్ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడంలో భాగంగా దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వాహనాలకు నామినీ పేరు జత చేస్తే చాలా వరకు వాహనదారులకు కొత్త తలనొప్పులు తగ్గుతాయి.

వీలైతే వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వెహికల్ ఓనర్‌తోపాటు నామినీ పేరును జత చేసేలా కొత్త నియమాలు అమలులోకి రాబోతున్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వకపోయినా తరువాత కూడా వెహికల్ నామినీ పేరును జత చేర్చే వెసలుబాటు అందుబాటులోకి రానుంది.

Also Read : SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్, పూర్తి వివరాలు

ప్రస్తుతం మోటార్ వెహికల్ యాక్ట్‌కు సవరణలు చేసి కొత్త రూల్స్ అమలులోకి రావడం ద్వారా వాహనదారులకు ప్రయోజనం చేకూరనుంది. వాహనాన్ని సులభంగా నామినీ పేరు మీదకి ఓనర్‌షిప్ మార్చుకోవచ్చు. వాహనదారుడు ఏదైనా కారణంతో చనిపోయినా.. నామినీ పేరు పైకి వెహికల్‌ను రిజిస్టర్ చేయవచ్చు. వాహనం యజమాని మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నామినీ పేరు జత చేయకపోతే వెహికల్ ఓనర్ కుటుంబ సభ్యులు తగిన పత్రాలు సమర్పిస్తే వాహనాన్ని బదిలీ చేస్తారు.

Also Read : Bigg Boss Telugu 4: బెస్ట్ కెప్టెన్ హారిక.. వరస్ట్ ఎవరో తేల్చేందుకు రచ్చరచ్చ!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link