Norway Night Time: ఆ దేశంలో రాత్రి సమయం ఎంత సేపుంటుందో తెలుసా..
![Norway Night Time: ఆ దేశంలో రాత్రి సమయం ఎంత సేపుంటుందో తెలుసా.. Norway the country of midnight sun stays night only for 40 minutes, no sunrise](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/norway-snow-fall.png)
నార్వే ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటి. ధనిక దేశంతో పాటు ప్రాకృతిక రమణీయతకు పెట్టింది పేరు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతం నుంచి ఇక్కడికి పర్యాటకులు తరలివస్తుంటారు.
![Norway Night Time: ఆ దేశంలో రాత్రి సమయం ఎంత సేపుంటుందో తెలుసా.. Norway the country of midnight sun stays night only for 40 minutes, no sunrise](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/norway-night-pic.png)
నార్వే సముద్రతీరం నిజంగానే ఓ సుందరమైన ప్రాంతం. బీచ్ నుంచి ఇక్కడి నివాస ప్రాంతాల వ్యూ పాయింట్ అద్భుతం.
![Norway Night Time: ఆ దేశంలో రాత్రి సమయం ఎంత సేపుంటుందో తెలుసా.. Norway the country of midnight sun stays night only for 40 minutes, no sunrise](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/norway-night.png)
నార్వే నిజంగానే భూతల స్వర్గంలా ఉంటుంది. మంచుతో నిండుకున్న పర్వతాలు, పచ్చని పైరులు పర్యాటకుల్ని ఏడాదంతా ఆకర్షిస్తుంటాయి. మీరెన్నడూ చూడని అద్భుతమైన, అందమైన ప్రదేశాలు ఇక్కడే సొంతం.
నార్వే సుందర రమణీయత పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఇదొక మంచి అనువైన ప్రాంతం. ఇక్కడి ప్రకృతి, అందాలు అందర్నీ హత్తుకుంటుంటాయి.
ఉత్తర నార్వేలో శీతాకాలంలో సైతం సూర్యోదయం జరగదు. వేసవిలో సూర్యాస్తమయం ఉండదు. నార్వేలోని రోరోస్ నగరం అత్యంత చలిప్రదేశంగా భావిస్తారు. ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీలకు పడిపోతుంది.
నార్వేలో రాత్రి 12 గంటల 43 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. కేవలం 40 నిమిషాల విరామం తరువాత సూర్యోదయమైపోతుంది. అందుకే ఈ దేశాన్ని కంట్రీ ఆఫ్ మిడ్‌నైట్ సన్ అని పిలుస్తారు. ఇది ఆర్కిటిక్ ప్రాంత పరిధిలోనిది. అందుకే ఇక్కడ మే-జూలై మధ్యకాలంలో అయితే 76 రోజుల వరకూ సూర్యాస్తమయమే జరగదు.