Mauni Amavasya: కుంభమేళాకు వెళ్లలేకపోతున్నారా..? ఇవి చేస్తే కుంభమేళాకు వెళ్లినంత పుణ్యఫలం

కుంభమేళాకు వెళ్లలేని వారు ఇలా చేయాలి. మౌని అమావాస్య రోజు చేయాల్సిన పద్ధతులు, నియమాలు ఇలా ఉన్నాయి. కింద చెప్పినవి చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి.

మౌని అమావాస్య రోజున మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయలేని వారు మీకు సమీపంలోని పవిత్ర నదులలో పుణ్య స్నానం చేయాలి. మూడు సార్లు లేదా ఐదుసార్లు మునక వేయాలి.

పుణ్యస్నానాల అనంతరం మౌన అమావాస్యను పురస్కరించుకుని భక్తులు శ్రీహరి లక్ష్మీదేవిని, గంగామాతను పూజించాలి.
మౌని అమావాస్య రోజున మహా కుంభమేళాకు వెళ్లలేని భక్తులు మౌన ఉపవాస దీక్ష చేయాలి. దీనివలన శుభం కలుగుతుంది.
మౌని అమావాస్య రోజు సాయంత్రం ఇంట్లో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. భక్తితో పూజలు చేయాలి.
మౌని అమావాస్య రోజున భక్తులు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు అర్ఘ్యంగా సమర్పించాలి.
మౌని అమావాస్య రోజు ‘ఓం పితృ దేవతాయై నమః’ అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. దీంతో మీ పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది.