Govt Schemes: రూ.5 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.కోటి ఆదాయం.. సింపుల్‌గా ఇలా చేయండి
మీ వయస్సు 30 ఏళ్లు అనుకుంటే.. ఎన్‌పీఎస్ అకౌంట్‌లో ప్రతి నెలా రూ.5 వేలు జమ చేశారని అనుకుంటే.. ఏడాదికి మీ పెట్టుబడి రూ.60 వేలు అవుతుంది. రాబోయే 30 ఏళ్లలో మొత్తం దాదాపు రూ.18 లక్షలు అవుతుంది.
ఈ డబ్బును మీరు మెచ్యూరిటీపై మొత్తం రూ.1,13,96,627 పొందుతారు. మీ పెట్టుబడి అమౌంట్ తీసేస్తే.. వడ్డీ రూ.95,96,627 అవుతుంది. వినియోగదారులు సమ్మేళనం వడ్డీ ప్రయోజనం కూడా ఉంటుంది. దీంతో ఇన్వెస్టర్లు మంచి ఆదాయాన్ని పొందుతారు.
ఎన్‌పీఎస్ స్కీమ్‌లో పదవీ విరమణ సమయంలో రెండు విధాలుగా డబ్బును తీసుకోవచ్చు. మీరు మొత్తం డబ్బును యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి పెన్షన్ తీసుకోవడం.. రెండో ఆప్షన్ ఏంటంటే.. మొత్తంలో 60 శాతం విత్‌డ్రా చేసుకుని మిగిలిన 40 శాతంతో యాన్యుటీ ప్లాన్‌ను ఇన్వెస్ట్ చేయడం. ఎన్‌పీఎస్‌లో కనీసం 40 శాతం యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఖాతాదారులు రూ.1,13,96,627లో 40 శాతం అంటే రూ.45,58,650 యాన్యుటీలో పెట్టుబడి పెడితే.. మీకు కొద్దిమొత్తంలోనే పెన్షన్ వస్తుంది.
దీని మీద 7 నుంచి 8 శాతం వార్షిక వడ్డీ లభిస్తే.. మీ పెన్షన్ సంవత్సరానికి రూ.3,19,105 నుంచి రూ.3,64,692 వరకు ఉంటుంది. అంటే మీరు రూ.26,592 నుంచి రూ.30,391 నెలవారీ పెన్షన్ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.