NPS Vatsalya Scheme: 18 ఏళ్లు నిండితే 78 లక్షలు, NPS Vatsalya ఎలా లెక్కించాలి
![NPS Vatsalya Scheme: 18 ఏళ్లు నిండితే 78 లక్షలు, NPS Vatsalya ఎలా లెక్కించాలి NPS Vatsalya Account benefits how to start it](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/nps-calculator2.jpg)
ఇది కాకుండా ప్రతి నెలా 10 వేల రూపాయలు 18 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రతి యేటా 12.86 శాతం వడ్డీ ఉంటుంది. ఎన్‌పీఎస్‌లో 75 శాతం ఈక్వీటీ సెలెక్ట్ చేసుకుంటే రిటర్న్ బాగుంటుంది. 18 ఏళ్ల తరువాత దాదాపుగా 78 లక్షల 1 వేయి 61 రూపాయలు వస్తాయి.
![NPS Vatsalya Scheme: 18 ఏళ్లు నిండితే 78 లక్షలు, NPS Vatsalya ఎలా లెక్కించాలి NPS Vatsalya Account benefits how to start it](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/nps-calculator1_0.jpg)
ప్రతి నెలా 10 వేల రూపాయలు 18 ఏళ్ల వరకు పెట్టుబడి పెడితే ప్రతి యేటా 12 శాతం వడ్డీ లభిస్తుంది. 18 ఏళ్ల తరువాత దాదాపుగా 71 లక్షల 17 వేల 286 రూపాయలు అందుతాయి.
![NPS Vatsalya Scheme: 18 ఏళ్లు నిండితే 78 లక్షలు, NPS Vatsalya ఎలా లెక్కించాలి NPS Vatsalya Account benefits how to start it](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/nps-calculator6.jpg)
మీరు ప్రతి నెలా 10 వేల రూపాయలు 18 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రతి ఏటా 10 శాతం వడ్డీ లభిస్తుంది. మొత్తం 21,60,000 జమ చేయవచ్చు. రిటర్న్స్ మీకు దాదాపుగా 57.64 లక్షలు అందుతాయి
ఈ ఎక్కౌంట్ పిల్లల పేరుతో తెరిచేందుకు పుట్టిన తేదీ పత్రం, కేవైసీ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ కార్డు అవసరమౌతాయి. తల్లిదండ్రుల పాన్‌కార్డు కూడా అవసరం.
పిల్లల పేరుతో ఎన్‌పీఎస్ వాత్సల్య ఎక్కౌంట్ ఓపెన్ చేస్తే 18 ఏళ్లు నిండాక అందులోంచి ఎగ్జిట్ కావచ్చు. పిల్లలు ఎక్కౌంట్‌లో 2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే మొత్తం డబ్బులు ఒకేసారి డ్రా చేయవచ్చు. 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే 20 శాతం డబ్బులు ఒకేసారి తీయవచ్చు. మిగిలిన డబ్బుల్ని రెగ్యులర్ ఆదాయం కోసం యాన్యుటీ కొనుగోలు చేయవచ్చు.
దేశంలోని అన్ని బ్యాకులు ఎన్‌పీఎస్ వాత్సల్యను ప్రారంభించాయి. ఎన్‌పీఎస్ వాత్సల్య ఎక్కౌంట్ రెగ్యులర్ ఎన్పీఎస్ ఎక్కౌంట్ లానే ఆటో ఛాయిస్, యాక్టివ్ ఛాయిస్ ఆప్షన్లతో ఉంటుంది. ఇందులో ఈక్విటీ రేషియో 50 శాతం ఉంటుంది. ఆటో ఛాయిస్‌లో 75 శాతం, 50 శాతం, 25 శాతం ఆప్షన్లు ఉంటాయి.
ఎన్‌పీఎస్ వాత్సల్య పధకం నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు విస్తరణ మాత్రమే. ఇందులో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు ఎక్కౌంట్ ఓపెన్ చేస్తారు. 18 ఏళ్లు పూర్తయ్యాక ఆ పిల్లలు ఎక్కౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా చేయగలరు. రెగ్యులర్ ఎన్‌పీఎస్ ఎక్కౌంట్‌గా మార్చుకోవచ్చు. ఎన్‌పీఎస్ ఎక్కౌంట్‌లో పెన్షన్ 60 ఏళ్లకు లభిస్తుంది