NSG Commandos: చంద్రబాబు సహా 9 మంది నేతల భద్రత నుంచి వైదొలిగిన ఎన్‌ఎస్‌జీ కమాండోల జీతం ఎంతో తెలుసా? సీఆర్‌పీఎఫ్‌ శాలరీతో పోలిస్తే...

Thu, 17 Oct 2024-9:59 am,

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా ఈ ఎన్‌ఎస్‌జీలోని బ్లాక్‌ క్యాట్‌ కమాండోలు జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తోంది. సాధారణంగా ఈ ఎన్‌ఎస్‌జీ కమాండోలు చాలా ధైర్యసాహసాలు, కఠోరమైన శిక్షణ కలిగి ఉంటారు. వీరి జీతం సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో పోలిస్తే ఎంతో తేడా ఉంటుంది తెలుసా?  

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్య నాథ్‌, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి,  కేంద్ర మంత్రి సర్భానంద్‌ సోనోవాల్‌, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌ సింగ్‌, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీకి ఈ కమాండోలు భద్రత కల్పిస్తున్నారు.  

అదేవిధంగా జమ్మూ కశ్మీర్‌ సీఎం, డెమొక్రాటిక్‌ ప్రొగ్రెసీవ్‌ ఆజాద్‌ పార్టీ కాంగ్రెస్‌ అధ్యక్షడు గులాం నబీ ఆజాద్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నేషనల్‌ కాన్పరన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లాకు కూడా  మొత్తం 9 మందికి ఈ బలగాలు భద్రత ఉంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌జీ భద్రతను కేంద్రం ఉపసంహరించింది.

ఈ ప్రముఖులకు సీఆర్‌పీఫ్‌ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది కేంద్రం. ఇటీవలె పార్లమెంటు నుంచి కూడా ఈ బెటాలియన్‌ను తొలగించింది.   

ఎన్‌ఎస్‌జీ కమాండో జీతం ఎంత? NSG కమాండో జీతభత్యాలు ఎంత అందుకుంటారో తెలుసా? సాధారణంగా వీరికి శిక్షణ సమయంలో నెలకు రూ.18,000 స్టైఫండ్‌ లభిస్తుంది. శిక్షణ పూర్తయిన తర్వాత రూ.40,000-85,000 వేతనం లభిస్తుంది. ఇది కాకుండా ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.

ఈ ఎన్‌ఎస్‌జీ కమాండోలకు ఇతర సౌకర్యాలు కూడా పొందుతారు. డీఏ, క్యాంటీన్‌, ప్రభుత్వ వసతి, వైద్య సదుపాయాలు, పెన్షన్‌ కూడా లభిస్తుంది.  

మన దేశంలో ఎన్‌ఎస్‌జీని బ్లాక్‌ కమాండో అని కూడా అంటారు. 1984 ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ నుంచి దీనికి పునాది పడింది. అప్పటినుంచి ఈ కమాండో అంతర్గత, బాహ్య భద్రతలో కీలకపాత్ర పోషిస్తుంది.  

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (crpf) వీరికి ప్రారంభంలో నెలకు జీతం రూ.21,700-రూ.69,100 ఉంటుంది. దీంతోపాటు సీఆర్‌పీఎఫ్ బలగాలకు కూడా ఇతర అలవెన్సులు ఉంటాయి.  

సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌కు మాత్రం రూ.30,000 నుంచి రూ.35,000 ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా పొందుతారు. నిబంధనల ప్రకారం అలవెన్సులు, మినహాయింపులు ఉంటాయి. వీరికి హెచ్‌ఆర్‌ఏ కూడా లభిస్తుంది.   

పిల్లకు కూడా వైద్యం, డీఏ వంటివి పొందుతారు. ఇతర ప్రాంతాల్లో పనిచేసేందుకు ప్రత్యేక భత్యం, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్ కూడా పొందుతారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link