NTR Jr: కథానాయకుడిగా ఎన్టీఆర్ తీసుకున్న మొదటి పారితోషికం ఎంతో తెలుసా..
టాలీవుడ్ లో నందమూరి మూడో తరం నట వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. అంతేకాదు యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ అన్ని అంశాల్లో అగ్ర కథానాయకుడిగా టాలీవుడ్ లో సత్తా చూపెడుతున్నాడు.
ఎన్టీఆర్ చిన్నపుడు తాత.. పెద్ద ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ‘బ్రహర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్ లో భరతుడి పాత్రతో కెమెరా ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో బాబాయి బాలకృష్ణ కుమారుడి పాత్రలో నటించాడు. కానీ ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు.
1997లో అంతా చిన్న పిల్లలతో తెరకెక్కిన ‘రామాయణం’ మూవీతో శ్రీరాముడిగా థియేటర్స్ లో తొలిసారి ఎన్టీఆర్ మూవీ విడుదలైంది. ఈ సినిమాలో బాల రాముడిగా ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నిన్ను చూడాలని’ చిత్రంతో సోలో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాను వీ.ఆర్.ప్రతాప్ డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఈ సినిమా స్టార్ట్ అయినపుడు ఎన్టీఆర్ వయసు 17 యేళ్లు.
ఈ సినిమా ఎన్టీఆర్ 18వ పుట్టినరోజు తర్వాత 5 రోజులకు మే 25న విడుదలైంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కు దివంగత రామోజీ రావు రూ. 4 లక్షల పారితోషికం ఇచ్చినట్టు ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అప్పట్లో అంత డబ్బును ఏం చేయాలో తెలియక తన తల్లికి ఇచ్చాడట. అంతేకాదు ఆ డబ్బును ఎన్ని సార్లు లెక్క పెట్టినట్టు తెలిపాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ పారితోషికం ఎన్నో రెట్టు పెరిగింది. రూ. 4 లక్షల నుంచి దేవర కోసం రూ. 100 కోట్ల పారితోషికం అందుకునే స్థాయికి చేరింది. దేవర తర్వాత ‘వార్ 2’ కోసం కూడా ఎన్టీఆర్ దాదాపు రూ. 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్ కు వెళ్లాడు.