Prabhas: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

Tue, 16 Jul 2024-8:00 am,

ఆ తరంలో ఎన్టీఆర్, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది.. వివరాల్లోకి వెళితే..

Prabhas as Karna: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమాలో ప్రభాస్.. భైరవ పాత్రతో పాటు పురాణ పాత్ర అయినా.. కర్ణుడిగా కాసేపు అలా కనిపించారు. అయితే.. ఈ జనరేషన్ లో ఈ కర్ణుడిగా ప్రేక్షకుల్లో ప్రభాస్ .. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకు ముందు కర్ణుడి పాత్రలు చేసిన హీరోల విషయానికొస్తే..

మహా నటుడు ఎన్టీఆర్ కూడా అప్పట్లో ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో కర్ణుడి పాత్రలో నటించి మెప్పించారు. అంతకు ముందు ఎన్టీఆర్.. ‘కథానాయకుడి కథ’ సినిమాలో ఓ సన్నివేశంలో కర్ణుడి పాత్రలో అన్నగారు అలా కనిపించారు. ఈ సినిమాను అన్నగారు డైరెక్ట్ చేస్తూ.. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడి పాత్రలో మెప్పించడం విశేషం.

అటు అన్నగారి ‘దాన వీర శూర కర్ణ’ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ కృష్ణ నటిస్తూ నిర్మించిన ‘కురుక్షేత్రం’ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు .. కర్ణుడి పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమాను ఎన్టీఆర్ గురుతుల్యులు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఒక రకంగా చూసుకుంటే.. దాన వీర శూర కర్ణ కంటే ఈ సినిమా టెక్నికల్ గా పురాణాలను పక్కదారి పట్టించుకుండా సరైన విధంగా తెరకెక్కించడం విశేషం.

ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఘటోత్కచుడు’ సినిమాలో డాక్టర్ రాజశేఖర్.. కర్ణుడి పాత్రలో అలా కనిపించారు. మరోవైపు రాజశేఖర్.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘కల్కి’ టైటిల్ తో ఓ సినిమా చేయడం విశేషం.

తాజాగా ప్రభాస్.. ‘కల్కి 2898 AD’ మూవీలో భైరవ పాత్రతో పాటు .. మన ఇతిహాసానికి సంబంధించిన పురాణ పురుషుడు కర్ణుడి పాత్రలో కాసేపు కనిపంచారు. ఇక కల్కి రెండో పార్ట్ లో ‘కర్ణుడి’ తో పాటు మహా భారతాన్ని ఎలా చూపిస్తాడనేది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకిస్తోంది.

మొత్తంగా ఆ తరంలో అన్న ఎన్టీఆర్.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజులు కర్ణుడి పాత్రలో మెప్పిస్తే.. ఆ తర్వాత తరంలో డాక్టర్ రాజశేఖర్ కర్ణుడి పాత్రలో ఒదిగిపోయాడు. తాజాగా ‘కల్కి’ మూవీలో ప్రభాస్.. కర్ణుడిగా కాసేపు అలా కనిపించి కనువిందు చేసాడు. మరి పూర్తి స్థాయిలో కనిపిస్తే.. ఆడియన్స్ కు గూస్ బంప్స్ అని చెప్పాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link