October Lucky Zodiacs: అక్టోబర్‌లో బుధుడు రెండు సార్లు సంచారం.. 3 రాశులవారికి ధనయోగం వరించబోతోంది!

Fri, 27 Sep 2024-11:12 am,

బుధుడు ఒకే నెలలో రెండు సార్లు గ్రహ సంచారం చేయడం చాలా అరుదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇలా సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు.  

బుధుడు అక్టోబర్‌ నెలలో రెండు సార్లు సంచారం చేయడం వల్ల తులా రాశివారు ఎక్కువగా ప్రభావితమవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరు కెరీర్‌కి సంబంధించిన జీవితంలో ఊహించని లాభాలు పొందుతారు.  

అలాగే తులా రాశివారికి దాంపత్య జీవితం కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి కూడా విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.  

వృషభ రాశివారికి వారికి కూడా ఈ సమయంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు చేసేవారికి అనుకున్న ప్రమెషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు రావడం కూడా విపరీతంగా పెరుగుతాయి. వీరికి పనుల్లో వస్తున్న అడ్డంకులు కూడా సులభంగా తొలగిపోతాయి.   

మిథున రాశి వారికి కెరీర్‌ పరంగా ఊహించని లాభాలు కలుగుతాయి. వీరికి దీర్ఘకాలిక వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా కొత్త జాబ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. దీంతో పాటు కుటుంబంలో శాంతి కూడా పెరుగుతుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link