Oneplus 11R Vs Oneplus 11: వన్‌ప్లస్ ఈ మొబైల్స్ కొనేవారు 8 తేడాలు తప్పకుండా తెలుసుకోండి..
వన్ ప్లస్ 11 5G ధర 56,999 నుంచి ప్రారంభం అవుతుంది. వన్ ప్లస్ 11R 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.39,999 నుంచి మొదలవుతుంది. ధర పరంగా ఈ రెండింటిలో వన్ ప్లస్ 11R 5G మొబైల్ చాలా బెస్ట్‌గా భావింవచ్చు.
వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల LTPO 3.0 QHD+ AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. దీన్ని స్క్రీన్k 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ 11R 5G లో 6.74-అంగుళాల AMOLED డిస్ప్లే తో అందుబాటులోకి వచ్చింది. ఇది120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో లభిస్తోంది.
OnePlus 11 5G మొబైల్‌లో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ పై రన్ అవుతుంది.
వన్ ప్లస్ 11 5G స్మార్ట్ ఫోన్ 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌లలో లభిస్తోంది. వన్ ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌లలో అందుబాటులో ఉంది.
OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ బ్యాక్ సెటప్‌లో 50MP + 48MP + 32MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో లభిస్తోంది. OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 50MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులో ఉంది.
వన్ ప్లస్ 11 5G మొబైల్ 5000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్‌తో మార్కెట్‌లో లాంచ్ అయ్యింది. OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ 5000mAh బ్యాటరీ 80W ఫాస్ట్ చార్జింగ్‌తో లభిస్తోంది.
OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ 11R 5G 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
అత్యుత్తమమైన డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరాను కావాలనుకునే వారికి OnePlus 11 5G స్మార్ట్ ఫోన్ చాలా బెస్ట్, ఇక మిడ్-రేంజ్ ధర, ఫీచర్లు కావాలనుకునేవారు OnePlus 11R మొబైల్ మంచి ఎంపికగా భావించవచ్చు.