Oneplus 12 Price Drop: ప్రీమియం ఫీచర్స్ Oneplus 12పై భారీగా బ్యాంక్ ఆఫర్స్ ప్రకటించిన వన్‌ప్లస్..
గతంలో మార్కెట్‌లోకి విడుదల అయిన OnePlus 12 స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అందులో ఎక్కువగా 12 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ అమ్ముడవుతుంది.
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రూ.64,999 ధరతో విక్రయిస్తోంది. ఈ మొబైల్‌ను మరింత తగ్గింపు పొందడానికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే..OneCard, ICICI క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇక ఈ మొబైల్‌పై బ్యాంక్ ఇతర కూపన్ ఆఫర్స్ అన్నీ పోను కేవలం రూ.62,999లకే లభిస్తోంది. దీంతో పాటు ఇతర ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో ఈ OnePlus 12 స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు కొన్ని వన్‌ప్లస్ ప్రోడక్ట్స్‌పై 30 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త స్నాప్‌డ్రాగన్ 3 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా దీని డిస్ల్పే 6.7-అంగుళాల QHD+ AMOLEDతో అందుబాటులో ఉంది. అలాగే ఇది మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో లభిస్తోంది.
ఈ OnePlus 12 మొబైల్ 5000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది త్రిపుల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. దీని బ్యాక్ సెటప్‌లో 50MP ప్రధాన సెన్సార్, 48MP వైడ్ యాంగిల్ లెన్స్, 32MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటాయి.