OnePlus 12R Price Cut: మరీ ఇంత చీపా? 16GB ర్యామ్‌ OnePlus 12R మొబైల్‌పై భారీ తగ్గింపు..

Tue, 03 Sep 2024-5:28 pm,

OnePlus లాంచ్‌ చేయబోయే 13 మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ మొత్తం మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులోకి రాబోతోంది.

ఇక ఈ వన్‌ప్లస్‌ 13 మోడల్‌లోని రెండవ వేరియంల్‌ 16GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రాబోతోంది. ఇక మూడవ వేరియంట్‌ 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. 

ఇదిలా ఉంటే ఇటీవలే లాంచ్‌ అయిన OnePlus 12R వేరియంట్‌పై ధర రూ. 2,000 తగ్గించి విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ. 39,999 కాగా ప్రత్యేకమైర తగ్గింపు ధరలో లభిస్తోంది.  

ఇక కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్స్‌ కూల్ బ్లూ, ఐరన్ గ్రేతో పాటు సన్‌సెట్ డ్యూన్ అనే మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీటిని కొనుగోలు చేసేవారికి JioPlus పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో రూ. 2,250 ప్రయోజనాలను పొందే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.   

ఇక ఇటీవలే లాంచ్‌ అయిన OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ కూడా కూడా లాంచ్‌ కాబోయే మోడల్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ను కలిగి ఉంటుంది. ఇక దీని ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది.  

అంతేకాకుండా ఈ OnePlus 12R స్మార్ట్‌ఫోన్‌ Qualcomm Snapdragon 8 Gen 2 octa-core చిప్‌సెట్‌పై రన్‌ కాబోతోంది. ఇది 5,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇవే కాకుండా మరెన్నో శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి.     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link