OnePlus Nord CE3 5G Price: తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్ మొబైల్..రూ.4,000 తగ్గింపుతో OnePlus Nord CE3 5G ఫోన్..

ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌లో భాగంగా OnePlus Nord CE3 5Gపై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌ను అదనపు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయడానికి వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు తగ్గింపు పొందవచ్చు.

వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో OnePlus Nord CE3 5G మొబైల్‌పై అదనపు తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్ ఎక్చేంజ్ చేసి అదనంగా రూ. 3,000 వరకు బోనస్ పొందండి.
అంతేకాకుండా ఈ OnePlus Nord CE3 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి కంపెనీ అదనంగా రూ. 4,500 విలువ చేసే రూ.399 JIO పోస్ట్ పేయిడ్ ఫ్లాన్ కూడా అందిస్తోంది. దీంతో పాటు ఫ్రీగా 6 నెలల వరకు Spotify ప్రీమియంను కూడా అందిస్తోంది.
ఈ OnePlus Nord CE3 5G స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాలు డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా Qualcomm Snapdragon 782G చిప్‌సెట్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ పని చేస్తుంది. దీంతో పాటు ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 13, ఆక్సిజన్‌ఓఎస్ 13.1పై పని చేస్తుంది.