Kanika Kapoor: ముగ్గురు పిల్లల ముందు 43 ఏళ్లకు పెళ్లి చేసుకున్న `సింగర్ ఆంటీ`

ప్రముఖ బాలీవుడ్ గాయని కణికా కపూర్ ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. కణికా పాటలు ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో భారీ హిట్లుగా నిలిచాయి.

బేబి డాల్, చిట్టియక్కలాయన్, టుకుర్ టుకుర్, జెండా పూల్ పాటలతోపాటు పుష్ప సినిమాలోని హిందీలో 'ఊ అంటావా ఊఊ అంటావా' అనే పాటలను మణికా కపూర్ పాడింది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఖత్రీ కుటుంబంలో జన్మించిన కణికా 12 ఏళ్ల వయసులో సంగీతంలో అరంగేట్రం చేసింది. పండిట్ గణేశ్ ప్రసాద్ మిశ్రా సంగీతంలో గురువుగా.. 15 ఏళ్ల వయసులో అనుప జలోటాతో కలిసి ప్రదర్శనలకు వెళ్లింది.
1988లో రాజ్ చందోక్ అనే ఎన్నారై రాజ్ చందోక్‌ను 18 ఏళ్ల వయసులో కణికా కపూర్ వివాహం చేసుకుంది. అనంతరం వీరిద్దరికి ముగ్గురు పిల్లలు కలిగారు. అయితే కొన్నేళ్ల తర్వాత కణికాకు రాజ్‌కు మధ్య విబేధాలు వచ్చాయి.
పిల్లల కోసం విబేధాలు పక్కనపెట్టి కొనసాగినా కూడా తర్వాత ముదిరిపోవడంతో 2012లో కణికా కపూర్ భర్త రాజ్‌తో విడాకులు తీసుకుంది. పదేళ్లు ముగ్గురు పిల్లలతో కలిసి జీవించింది.
కొన్నేళ్లకు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ హతిరమణితో కణికాకు పరిచయమైంది. ఆ పరిచయం తర్వాత కణికకు గౌతమ్ ప్రపోజ్ చేయగా ఆమె కాదనలేకపోయింది. వివాహం చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నాక కణికా ముగ్గురు పిల్లలు అంగీకరించలేదు.
2022లో లండన్‌లోని ఓ స్టార్ హోటల్‌లో పెళ్లి చేసుకోగా.. చివరకు కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఆ పెళ్లి వేడుకలో పాల్గొనడం విశేషం. తన పిల్లల ముందు గౌతమ్‌ను పెళ్లి చేసుకోవడంతో కణికా భావోద్వేగానికి లోనైంది.