Papaya Facemask: బొప్పాయి ఫేస్‌మాస్క్‌తో బోలెడు ప్రయోజనాలు.. హిరోయిన్‌ మించిన అందం మీ సొంతం..

Wed, 06 Nov 2024-9:05 am,
Papaya Skincare

బొప్పాయిని స్కిన్‌ కేర్‌ రొటిన్‌లో ఉపయోగించడం వల్ల మెరిసే అందం మీ సొంతమవుతుంది. ఇందులో ఉండే విటమిన్స్‌ మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేసి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దీంతో స్కిన్‌ నిత్య యవ్వనంగ కనిపిస్తుంది.  

Lemon

ఒక టీ స్పూన్‌ తేనె, ఒక కప్పు బొప్పాయి గుజ్జు, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్ ముఖం, మెడా భాగంలో అప్లై చేసి ఓ అరగంట పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ఫేస్ వాష్‌ చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్‌ ఉపయోగించాలి.  

Orange Juice

బొప్పాయి గుజ్జులో రెండు టీస్పూన్ల ఆరెంజ్‌ జ్యూస్‌ అప్లై చేసి ఓ అరగంటపాటు ఆరనవ్వాలి. డ్రైస్కిన్‌ సమస్యతో బాధపడుతున్నవారు కాస్త కీరదోస రసం కూడ కలపాలి. బొప్పాయి గుజ్జు, అరటిపండు కలిపి కూడా ముఖానికి ఫేస్‌ మాస్క్‌ వేసుకోవచ్చు.  

బొప్పాయి గుజ్జులో ఎగ్‌ వైట్‌ వేసి ముఖానికి అప్లై చేస్తే చర్మం టైట్‌గా మారుతుంది. ఈ ఫేస్‌ మాస్క్‌ను కూడా వారానికి రెండుసార్లు వాడటం వల్ల మెరుగైన ఫలితాలు కలుగుతాయి. బొప్పాయి రెండు టీస్పూన్లు, టమోటా జ్యూస్‌తో ట్యాన్‌ అయిన ప్రదేశంలో అప్లై చేయవచ్చు.  

ఈ ఫేస్‌ మాస్క్‌ డ్రైస్కిన్‌, మంగు మచ్చలను తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. బొప్పాయి ఫేస్‌ మాస్క్‌ తరచూ ఉపయోగించడం వల్ల మీ ముఖం మెరిసిపోతుంది. డైలీ రొటీన్‌లో బొప్పాయి మాస్క్‌తో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. మీ ముఖం నేచురల్‌గా మెరిసిపోతుంది. ఏ ఫేస్‌ మాస్క్‌ ఉపయోగించినా ముందుగా ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మేలు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link