Papaya Precautions: బొప్పాయితో ఈ పదార్ధాలు తింటున్నారా, తస్మాత్ జాగ్రత్త
మసాలా భోజనం కడుపులో సమస్యలకు కారణమౌతుంది. అందుకే ఇలాంటి బోజనం తరువాత బొప్పాయి తినడం మంచిది కాదు. ఎందుకంటే బొప్పాయి గుణం చలవచేసేది. మసాలా భోజనం వేడి చేస్తుంది. అందుకే ఈ రెండు కలిపి తింటే క్రాంప్స్, ఛాతీలో మంట, ఎసిడిటీ మొదలౌతాయి.
బొప్పాయిని ఎప్పుడూ ఫ్యాట్ నిండి ఉండే మాంసం, ఫ్రై భోజనం, క్రీమ్స్‌తో కలిపి తినకూడదు. జీర్ణ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావచ్చు. బొప్పాయి అనేది లో ఫ్యాట్ ఫ్రూట్. అందుకే హై ఫ్యాట్ పదార్ధాలతో కలిపి తినకూడదు.
రోజుకు బొప్పాయి ఎంత తినాలి
ఒక మీడియం సైజ్ బొప్పాయిలో దాదాపుగా 120 కేలరీలు, 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. రోజుకు కనీసం రెండు స్లైసెస్ బొప్పాయి తినడం మంచిది. ఎక్కువగా తింటే కడుపులో మంట, మల బద్ధకం దూరమౌతుంది.
బొప్పాయిలో ఎంజైమ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రోటీన్ల సంగ్రహణలో ఉపయోగపడుతాయి. హై ప్రోటీన్లు ఫుడ్స్ తినడం వల్ల జీర్ణక్రియలో సహాయమౌతుంది. అయితే మాంసం, చేపలతో కలిపి తినకూడదు.
బొప్పాయితో కలిగి ద్రాక్ష, ఆరెంజ్, కీను వంటి సిట్రస్ ఫ్రూట్స్ కలిపి తినకూడదు. సిట్రస్ ఫ్రూట్స్‌లో ఉండే విటమిన్ సి బొప్పాయిలో ఉండే విటమిన్ సి తో కలిసి రియాక్షన్ లేదా ఎసిడిటీ రావచ్చు
బొప్పాయిని స్మూదీగా తినడం మంచిది కాదు. బొప్పాయిని ఎప్పుడూ పాల ఉత్పత్తులతో కలిపి సేవించకూడదు. బొప్పాయిలో పపైన్, కైమోపపైన్ వంటి ఎంజైమ్స్ ఉన్నాయి. అందుకే పాల ఉత్పత్తులతో కలిపి తింటే కడుపులో స్వెల్లింగ్, గ్యాస్, క్రాంప్స్ సమస్యలు రావచ్చు.