Paris Olympics 2024 : భారత్ ఖాతాలో మరో పతకం..షూటింగ్‎లో స్వప్నిల్‎కు కాంస్యం..!!

Thu, 01 Aug 2024-2:32 pm,

Swapnil bronze medal in Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ సత్తా చాటుతోంది. ఇప్పుడు మరో పతకం భారత్ ఖాతలో చేరింది.షూటింగ్ విభాగంలోనే రావడం విశేషం. భారత యంగ్ షూటర్ స్వప్నిల్ కుసాలే భారత్ కు షూటింగ్ లో 3వ మెడల్ ను అందించాడు.   

పుణేలో జన్మించిన స్వప్నిల్ అంతకముందు ..పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల రైఫిల్ 50మీటర్ల 3 పొజిషన్ ఈవెంట్ లో ఫైనల్ కు చేరుకుని అద్భుతంగా రాణించారు. క్వాలిఫికేషన్ రౌండ్ లో 38 ఇన్నర్ 10లతో సహా 60షాట్స్ నుంచి 590 పాయింట్లతో టాప్ 8 షూటర్లలో స్థానం సంపాదించేందుకు స్వప్నిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. స్థిరమైన ప్రదర్శనతో స్వప్నిల్ తుదివరకు సాగింది.   

స్వప్నిల్ కుసలే నేపథ్యం ఇదే: పూణేలో ఆగస్టు 6వ తేదీ 1995లో జన్మించాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. 2009లో స్వప్నిల్ తండ్రి అతన్ని మహారాష్ట్రలోని క్రీడా ప్రభోదిని అనే ప్రాథమిక క్రీడా కార్యక్రమంలో చేర్పించారు. అక్కడి నుంచి అతని జర్నీ షురూ అయ్యింది. ఒక ఏడాది కఠినమైన ట్రైనింగ్ తర్వాత తను షూటింగ్ ను ఎంపిక చేసుకున్నాడు. అతని అంకితభావం, ప్రతిభకు త్వరగానే గుర్తింపు లభించింది.   

2013లో లక్ష్య స్పోర్ట్స్ నుంచి స్పాన్సర్ షిప్ తీసుకున్నాడు. షూటింగ్ ప్రపంచంలో కుసలే సాధించిన విజయాలేన్నో ఉన్నాయి. 2015లో కువైట్లో జరిగిన ఆసియా షూటింగ్ ఛాపింయన్ షిప్ లో 50మీటర్ల రైఫిల్ ప్రోన్ 3 ఈవెంట్ బంగారు పతకం సాధించాడు. తుగ్లకాబాద్ లో జరిగిన 59వ జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ ను సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.   

అంతేకాదు చైన్ సింగ్, గగన్ నారింగ్ వంటి ఫేమస్ షూటర్లను సైతం అధిగమించి హిస్టరీ క్రియేట్ చేశాడు. తిరువనంత పురంలో జరిగిన 61వ జాతీయ ఛాంపియన్ షిప్ లో మరోసారి చక్కటి ప్రదర్శనను కనబరిచి విజయాన్ని అందుకున్నాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ లో స్వర్ణం సాధించాడు. 

ఇక అటు 2022లో జరిగిన కైరో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వప్నిల్ 4వ స్థానంలో నిలిచాడు. భారత్ ఒలింపిక్ కోటాలో  స్థానం దక్కించుకున్నాడు.  2022 ఆసియా గేమ్స్ లోనూ స్వర్ణం సాధించాడు. 2023బాకులో జరిగిన ప్రపంచ కప్ లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం, వ్యక్తిగత టీమ్ లో 2 రజత పతకాలతో మరో స్వర్ణం తన ఖాతాలో వేసుకున్నాడు. 2022లో ప్రపంచ ఛాంపియిన్ షిప్ లో టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021 న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ కప్ ఈవెంట్ లో స్వర్ణం సాధించగా...తాజాగా ఒలింపిక్స్ కాంస్య పతకం సాధించాడు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link