Paris Olympics 2024: పసిడిపై భారత్ ఆశలు, పైనల్‌కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా
పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో ఇప్పటికే మూడు పతకాలు సాధించిన ఇండియా ఇప్పడు జావెలిన్ త్రోపై దృష్టి సారించింది. టోక్యో ఒలింపిక్స్ జావెలివ్ త్రో పసిడి విజేత నీరజ్ చోప్రా మరోసారి భారత్ ఆశలు చిగురించేలా రాణిస్తున్నాడు. ఫైనల్‌కు అర్హత సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా శుభారంభం చేశాడు. క్వాలిఫయింగ్ పోటీలో సత్తా చాటి ఫైనల్‌లో అడుగుపెట్టాడు.
క్వాలిఫైయింగ్ పోటీలో సీజన్‌లోనే బెస్ట్ ప్రదర్శన ఇచ్చాడు. ఏకంగా 89.34 మీటర్ల దూరం జావెలిన్ విసిరి పైనల్‌కు అర్హత సాధించాడు. పసిడి పతక రేసులో నిలిచాడు.
క్వాలిఫైయింగ్ రౌండ్‌లో గ్రూప్ బి నుంచి నీరజ్ చోప్రా ఫైనల్‌కు చేరాడు. ఈసారి కూడా నీరజ్ చోప్రా ఇండియాకు జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ అందిస్తాడనే అంచనాలు భారీగా ఉన్నాయి.
అటు నీరజ్ చోప్రాకు పోటీగా భావిస్తున్న పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇతడు 86.59 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు.
అదే సమయంలో ఇండియాకు చెందిన మరో జావెలిన్ త్రో అథ్లెట్ కిషోర్ కుమార్ జెనా గ్రూప్ ఏ నుంచి ఫైనల్ కు అర్హత సాధించలేకపోయాడు.